Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ రచయిత శోభా డేకు అమితాబ్ చెప్పుదెబ్బలాంటి సమాధానం!

ప్రముఖ రచయిత్రి శోభా డేకు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌లు చెప్పుదెబ్బలాంటి ట్వీట్లతో సమాధానం ఇచ్చారు. రియో ఒలింపిక్స్ క్రీడల్లో మహిళల సింగిల్స్ విభాగం బ్యాడ్మింటన్ క్రీ

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2016 (16:32 IST)
ప్రముఖ రచయిత్రి శోభా డేకు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌లు చెప్పుదెబ్బలాంటి ట్వీట్లతో సమాధానం ఇచ్చారు. రియో ఒలింపిక్స్ క్రీడల్లో మహిళల సింగిల్స్ విభాగం బ్యాడ్మింటన్ క్రీడలో అద్భుతంగా రాణిస్తున్న భారత క్రీడాకారిణి పీవీ సింధునుద్దేశించి శోభా డే ట్విట్టర్‌లో 'సిల్వర్ ప్రిన్సెస్' అంటూ ఓ ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లతో పాటు కోట్లాది మంది భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో శోభా డేకు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, బాలీవుడ్ నటుడు బిగ్ బిలు తగిన రీతిలో కౌంటర్ ఇచ్చారు. శోభా డేను ఉద్దేశించి సెహ్వాగ్ చేసిన ట్వీట్‌లో శోభా అనే పదాలతో ఆడుకున్నాడు. 'సాక్షి మెడలో కాంస్య పతకం ఎంత శోభను ఇస్తోంది' అనే అర్థం వచ్చేలా హిందీలో ట్వీట్ చేశారు. 'శోభా దే' రహాహై అన్నారు. అలాగే, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు కూడా శోభా డే పట్ల చాలా కోపం వచ్చింది. అయితే ఆయన ఆమె పేరు ప్రస్తావించకుండానే తాను చెప్పదలచుకుంది చెప్పేశారు.
 
''మీరు ఖాళీ చేతులతో కాదు, మెడల్ తీసుకుని వస్తున్నారు.. మేం మీతో సెల్ఫీ తీసుకోవాలని అనుకుంటున్నాం'' అని పీవీ సింధును ఉద్దేశిస్తూ అమితాబ్ ట్వీట్ చేశారు. దాంతో పాటు మీరు అతిగా వాగేవాళ్ల నోరు మూయించారని మరో ట్వీట్ చేశారు. పనులే మాట్లాడతాయని, అవి కూడా అప్పుడప్పుడు 'పెన్ను'ను ఓడిస్తాయని ఆయన అన్నారు. మనవాళ్లు సెల్ఫీలు తీసుకోడానికే అక్కడకు వెళ్తున్నారన్న రచయిత్రి శోభా కామెంట్లను గుర్తుచేస్తూ అమితాబ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

తర్వాతి కథనం
Show comments