నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్.. ఆరు రోజుల లాభాలకు స్వస్తి

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2015 (17:28 IST)
భారత స్టాక్ మార్కెట్ ఆరు రోజుల తర్వాత నష్టాలను చవిచూసింది. వరుసగా ఆరు రోజుల పాటు లాభాల్లో ముగిసిన సెన్సెక్స్ సూచీ.. గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 190 పాయింట్ల నష్టంతో 26845 వద్ద ముగిసింది. అలాగే, నిఫ్టీ సైతం 48 పాయింట్లును కోల్పోయి 8129 వద్ద ఆగింది. 
 
వరుసగా ఆరు సెషన్లలో లాభాలను నమోదు తర్వాత ఇన్వెస్టర్లు తమ ఈక్విటీలను విక్రయించేందుకే మొగ్గు చూపారు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీలలో సైతం ఇదే ట్రెండ్ కనిపించింది. సెషన్ ఆరంభంలో క్రితం ముగింపు వద్ద ఉన్న సెన్సెక్స్ సూచిక ఆపై నెమ్మదిగా కిందకు జారిపోయింది. 
 
మంగళవారం నాటి సెషన్లో రూ.99,30,391 కోట్లుగా ఉన్న మార్కెట్ కాప్, రూ.98,81,674 కోట్లకు తగ్గింది. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 1.01 శాతం, స్మాల్ క్యాప్ 0.15 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో అల్ట్రా టెక్ సిమెంట్స్, అదానీ పోర్ట్స్, వీఈడీఎల్, టాటా స్టీల్, ఏసియన్ పెయింట్స్ తదితర కంపెనీల షేర్లు లాభపడగా, గెయిల్, రిలయన్స్, ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, యస్ బ్యాంక్ తదితర కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushmita Konidela : గోల్డ్ బాక్స్ తో నూతన చాప్టర్ బిగిన్స్ అంటున్న సుష్మిత కొణిదెల

ట్రోలింగ్ చేస్తే ఏంటి ప్రయోజనం.. నా వ్యాఖ్యలను వక్రీకరించారు.. రేణు దేశాయ్

Chiru: చిరంజీవి చిత్రం విశ్వంభర మళ్ళీ తెరముందుకు రాబోతుందా?

చాయ్ వాలా చిత్రం అందరికీ కనెక్ట్ కవుతుంది : సిటీ కమిషనర్ సజ్జనార్

మెచ్యూర్డ్‌ అండ్‌ ఇన్‌స్పిరేషన్‌ స్టోరీతో రాబోతున్న సినిమా శ్రీ చిదంబరం గారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

Show comments