Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్కెట్‌పై బీహార్ ఎన్నికల రిజల్ట్స్ ఎఫెక్ట్.. 600 పాయింట్లకు పైగా సెన్సెక్స్ నష్టం

Webdunia
సోమవారం, 9 నవంబరు 2015 (11:12 IST)
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బాంబే స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. ఫలితంగా సోమవారం ఉదయం ప్రారంభమైన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ సూచీ ఏకంగా 600 పాయింట్ల మేరకు నష్టపోయింది. ఆ తర్వాత అంటే 10:45 గంటల సమయంలో 325 పాయింట్ల నష్టంలో ఉంది. 
 
బీహార్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ విజయం సాధిస్తే, పలు కీలక బిల్లులు, సంస్కరణల అమలుకు మార్గం సుగమమవుతుందని పెట్టుబడిదారులు భావించడమే ఇందుకు కారణం. అయితే, బీజేపీ ఘోర పరాభవంతో గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ నుంచి బీమా సంస్కరణలు, భూసేకరణ, వివిధ రంగాల్లో ఎఫ్డీఐ పెంపు వంటి ముఖ్యమైన బిల్లులిప్పడు విపక్షాల నుంచి మరింత అడ్డంకులను ఎదుర్కోనున్నాయి. 
 
మరోవైపు 'మేకిన్ ఇండియా' అంటూ మోడీ చేపట్టిన ప్రపంచవ్యాప్త ప్రచారం అనంతరం, విదేశీ ఇన్వెస్టర్లు సైతం బీహార్ ఎన్నికలను నిశితంగా పరిశీలించారు. వీరంతా ఇప్పుడు దేశానికి పెట్టుబడులు పెట్టాలంటే మరోసారి ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక వచ్చే సంవత్సరం కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. బీహార్‌లో గెలిచి, ఆ రాష్ట్రాల్లో సత్తా చాటాలని భావించిన బీజేపీకి చుక్కెదురు కావడం కూడా ఇన్వెస్టర్ల మనోభావాలను దెబ్బతీయడంతో మార్కెట్ ట్రేడ్ నష్టాల్లో ప్రారంభమైంది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments