నష్టాల్లో సెన్సెక్స్ .. స్వల్పంగా బంగారం ధరలు

Webdunia
శుక్రవారం, 20 మే 2016 (18:12 IST)
బాంబే స్టాక్ మార్కెట్‌లో గత రెండురోజుల మాదిరిగానే శుక్రవారం కూడా స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ప్రారంభపు ట్రేడింగ్‌లో లాభాలను చవిచూసిన సెన్సెక్స్.. కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకుంది. ఆ తర్వాత ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 98 పాయింట్లు నష్టపోయి 25,032 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 34 పాయింట్లు నష్టపోయి 7,750 పాయింట్ల వద్ద స్థిరపడింది. 
 
ఈ ట్రేడింగ్‌లో అదానీ పోర్ట్స్, టాటా పవర్, ఐడియా, ఓఎన్జీసీ కంపెనీల షేర్లు లాభపడగా, లుపిన్ సంస్థ షేర్లు అత్యధికంగానూ, అంబుజా సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, బీపీసీఎల్, రిలయన్స్ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. 
 
మరోవైపు.. దేశీయంగా నగల వ్యాపారుల నుంచి బంగారం కొనుగోళ్లు పడిపోవడం, అంతర్జాతీయంగా మార్కెట్లు బలహీనంగా ఉండటంతో పసిడి ధర శుక్రవారం స్వల్పంగా తగ్గింది. రూ.50 తగ్గడంతో 99.9 స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధర రూ.29,750కి చేరింది. అదేవిధంగా వెండి ధర కూడా తగ్గింది. రూ.500 తగ్గడంతో కిలో వెండి ధర రూ.39,950 కి చేరింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

iBomma నాదని మీకెవరు చెప్పారు?: ఇమ్మడి రవి షాకింగ్ రిప్లై

Ghantasala: ఘంటసాల ది గ్రేట్ మ్యూజికల్ కాన్సర్ట్‌.. సందడిగా సెలెబ్రిటీ ప్రివ్యూ షో

Anil Ravipudi: చిరంజీవి, వెంకటేష్ అల్లరి, డ్యాన్స్, ఆడియన్స్ గుర్తుపెట్టుకుంటారు: అనిల్ రావిపూడి

Trivikram Srinivas: శుక్రవారం వచ్చే మొదటి ఫోన్ కాల్‌కి ఓ భయం ఉంటుంది : త్రివిక్రమ్ శ్రీనివాస్

Film Chamber: మోహన్ వడ్లపట్ల ఏకగ్రీవ ఎన్నిక పట్ల తెలుగు ఫిల్మ్ ఛాంబర్ హర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్ తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ట్రెండ్స్ రిపోర్ట్ 2025లో కీలక విషయాలు

పనిలో ఉన్నప్పుడు మైగ్రేన్: మనస్సును ప్రశాంతంగా, రోజును సజావుగా తీసుకెళ్లే మార్గాలు

శరీరంలోని ఎర్ర రక్తకణాల వృద్ధికి పిస్తా పప్పు

రాత్రిపూట పాలతో ఉడకబెట్టిన అంజీర పండ్లను తింటే?

తర్వాతి కథనం
Show comments