Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఊరికి రండి.. ఉండటానికి ఇల్లుతో పాటు డబ్బులిస్తాం.. ఎక్కడ..? (video)

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (16:31 IST)
వెకేషన్స్‌కి వెళ్లాలనుకునే వారికి ఇదొక పండగలాంటి వార్త. ఆ ప్రాంతంలో నివాసం ఉండాలనుకుంటే ఇల్లును ఇవ్వడమే కాకుండా ఖర్చులకు గానూ నెలకు సుమారు నలభై వేల రూపాయల డబ్బును కూడా ఇస్తారట. ఎక్కడ అని ఆశ్చర్యపోతున్నారా..అది ఒక చిన్న దీవి. గ్రీస్‌కు చెందిన యాంటికీతెరా ఐలాండ్. సుమారు 20 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న ఈ దీవి ప్రపంచానికి దూరంగా ఉంటుంది.
 
క్రీస్తు పూర్వం 100సంవత్సరాల నాటి కట్టడాలు కూడా అక్కడ కనిపిస్తాయట. పాతకాలం నాటి కంప్యూటర్‌లు దర్శనమిస్తాయి. జన సంచారం చాలా తక్కువ ఉండడంతో ఎలాగైనా జనసాంద్రతను పెంచాలనే ఉద్దేశంతో ఆర్థోడిక్స్ చర్చి కొత్త కుటుంబాలకు ఆహ్వానం పలుకుతోంది. అలాగే వారికి ఆర్థికంగా సాయం చేస్తామని తెలియజేస్తోంది. నివాసం ఉండేందుకు ఇంటితో పాటు వ్యవసాయం, వ్యాపారం చేసుకోవడానికి నెలకు 40 వేల 200 రూపాయలు ఇస్తుందట. 
 
ఎవరైనా ఐలాండ్‌లో ప్రశాంతంగా జీవితాన్ని గడపాలని కోరిక కలిగి ఉన్న వారికి ఇదొక మంచి అవకాశం. కాలానుగుణంగా మారే ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికి ఇదొక చక్కని ప్రదేశం. ఈ ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్లేందుకు రవాణా సౌకర్యం కూడా అందుబాటులోనే ఉంది అని తెలియజేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌కు కడుపుమంట ఎక్కువైంది.. ఈనో ప్యాకెట్లు పంపుతా : నారా లోకేశ్

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments