భోగిపళ్లు ఎందుకు పోయాలి... సంక్రాంతి స్పెషల్...

Webdunia
మంగళవారం, 13 జనవరి 2015 (21:30 IST)
పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున, అంటే జనవరి 14 తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. 
 
దేశంలో పెద్ద పండుగగా అన్ని ప్రాంతాల వారూ జరుపుకునే సంక్రాంతి పండుగ ముందు రోజును భోగి అంటారు. ఈ రోజున వివిధ కూరగాయలు, పాలు పోసి పులగాలు (పొంగలి) వండుతారు. ఈ భోగినాడే గొచ్చి గౌరీవ్రతం అనే వ్రతాన్ని ప్రారంభిస్తారు. భోగినాటి సాయంకాలం వేళ ఇంట్లో మండపాన్ని నిర్మించి అలంకరిస్తారు. 
 
ఆ అలంకరణలో పండ్లు, కూరగాయలు, చెరకు గడల లాంటి ప్రధానం వాడుతారు. మండపం మధ్యలో బియ్యం పోసి దాని మీద బంకమట్టితో చేసిన గౌరీ ప్రతిమను ఉంచుతారు. పూజ పూర్తి అయిన తర్వాత గౌరీదేవికి మంగళహారతులు పాడి ఆ రాత్రికి శయనోత్సవాన్ని చేస్తారు. ఆ మరునాడు అంటే మకర సంక్రాంతి నాడు ఉదయం సుప్రభాతంతో దేవిని మేల్కొలుపుతారు. 
 
ఇలా మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో సాయంకాలం వేళ ముత్తైదువులను పేరంటానికి పిలుస్తారు. నాలుగోరోజు గౌరీదేవికి పూజ అనంతరం ఉద్వాసన చెబుతారు. మంటపానికి అలంకరించిన కూరగాయలను నాలుగోరోజున కూర వండుతారు. ఇలా చేసిన కూరనే గొచ్చికూర అని అంటారు. 
 
ఆ తర్వాత గొచ్చి గౌరి ప్రతిమను చెరువులో గానీ, నదిలో కానీ నిమజ్జనం చేస్తారు. భోగినాడు ప్రారంభమైన ఈ వ్రతాన్ని కొంతమంది నాలుగు రోజులు, మరికొంతమంది ఆరు రోజులు చేయడం కూడా ఆచారం.
 
భోగినాడు బొమ్మల కొలువు పెట్టడం కూడా వ్రత విధానంగానే ఆచరిస్తారు. అలాగే భోగి పండుగ రోజు చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోయడం లాంటి వాటితో, పేరంటాలతో కళకళలాడుతూ ఉంటుంది. ఇంద్రుడు ప్రీతికోసం ఈ పండుగ జరుపుతుంటారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సర్‌ప్రైజ్ ప్రపోజ్ పేరుతో ప్రియుడి కళ్ళకు గంతలు కట్టి పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియురాలు...

ప్రియుడితో కలిసి భర్త హత్యకు భార్య కుట్ర... అద్భుతంగా తప్పించుకున్న భర్త..

గంజాయికి బానిసైన టెక్కీ, ఉద్యోగం ఊడగొట్టుకుని మేడ పైన గంజాయి సాగు, వీడియో

మహిళల పట్ల బీఆర్‌ఎస్‌కు ఎటువంటి గౌరవం లేదు: కవిత ధ్వజం

ఒక పార్టీయేమో కాంగ్రెస్ తొత్తు, ఇంకోటి భాజపాకి తొత్తు, ఈ రెండూ మనకొద్దబ్బా: టీవీకె విజయ్

అన్నీ చూడండి

లేటెస్ట్

19-04-2026 ఆదివారం ఫలితాలు : ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కుంటారు...

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజున అద్భుత కలయిక.. ఉప్పు, గవ్వలతో ఇలా చేస్తే?

Simhadri Appanna: అక్షయ తృతీయ నాడే సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం.. చందనోత్సవం

Parashurama Jayanti 2026: ప్రదోష కాలంలో జన్మించిన పరశురాముడు.. పూజ ఇలా చేస్తే?

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజున శని, రాహు దోషాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి..?

Show comments