ఆమెతో గడిపిన ఆ జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నా... ఆమె ఎందుకలా చేస్తుందీ...?

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2016 (16:43 IST)
గత ఏడాదిగా ఓ అమ్మాయితో నాకు పరిచయం ఉంది. మేమిద్దరం యూనివర్శిటీలో చదువుతున్నాం. నాకు ఇంతకుముందు గర్ల్ ఫ్రెండ్ లేరు. యూనివర్శిటీకి వచ్చాక అనుకోకుండా ఈమెతో పరిచయం ఏర్పడింది. ఇక అప్పట్నుంచీ మా పేరెంట్సుతోనైనా మాట్లాడకుండా ఉన్నానేమో కానీ ఆమెతో ఒక్కరోజు కూడా మాట్లాడకుండా లేను. అంతగా ఆమెతో ఎట్రాక్ట్ అయిపోయాను. ఇద్దరం సినిమాలకు, సాయంత్రం వేళల్లో పబ్బులకూ వెళ్లాము కూడా. ఇలా ఆమె-నేను చాలా క్లోజ్ అయిపోయాం. ఈమధ్య హఠాత్తుగా ఆమె బాంబులాంటి వార్త చెప్పింది. 
 
తను ఓ యువకుడితో ప్రేమలో పడిందట. అతడిని పెళ్లిచేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది. అదేంటి.. నేను నిన్ను చేసుకోవాలనుకున్నాను. నువ్వు-నేను చాలా క్లోజయ్యాం కదా అని అడిగితే... నేనలా ఎప్పుడూ భావించలేదని చెప్పి వెళ్లిపోయింది. అదేరోజు రాత్రి... కోపమొచ్చిందా అంటూ లాలనగా మాట్లాడింది. మనిద్దరి స్నేహం ఇలాగే ఉండాలి. ఎప్పటికీ ఒకరికొకరు మర్చిపోకూడదంటూ చెప్తోంది. ఆమె నాకు అర్థం కావడంలేదు. నన్నెందుకు వద్దనుకుని వేరేవాడిని పెళ్లాడాలనుకుంటుంది...?
 
ఆమే చెప్పింది కదా... మిమ్మల్ని ఆ భావనలో చూడలేదని. అలాగే మీరు కూడా ఆమె వేరే యువకుడిని ప్రేమిస్తున్నాననీ, పెళ్లి చేసుకుంటానని చెప్పేవరకూ మీ మనసులో ఉన్నదేమిటో చెప్పలేదు కదా. అందువల్ల మీరు తన పట్ల స్నేహపూర్వకంగా మాత్రమే ఉంటున్నారని అనుకుని ఉండవచ్చు. కాబట్టి జరిగిందేదో జరిగిపోయింది. ఆమె అనుకుంటున్నట్లే మీరు మంచి స్నేహితుడిగా ఉండిపోవడం మంచిది. ఇక మధుర జ్ఞాపకాలంటూ ఆమెతో కలిసి వెళ్లిన సమయాలను గుర్తు చేసుకుని సమయాన్ని వృధా చేసుకోవద్దు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నన్ను ట్రోల్ చేస్తే ఆ హీరోయిన్ ఎవరో చెప్పేస్తా: ఫ్యాన్స్‌కి విజయ్ భార్య సంగీత వార్నింగ్?!!

ది కేరళ స్టోరీ 2-గోస్ బియాండ్ విడుదలపై రెండు వారాల పాటు స్టే

ఆయేషా మీరా కేసు కొట్టివేయడంపై ఆమె తల్లిదండ్రులు సీరియస్- సీఎంకు విజ్ఞప్తి

సంగారెడ్డిలో ఘోర ప్రమాదం.. బస్సు, లారీ ఢీ.. 15మందికి తీవ్ర గాయాలు

కౌన్సిల్ మీటింగ్‌లోకి వచ్చిన తాచుపాము.. ఆ తర్వాత ఏమైందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ హీరో విజయ్ రిలేషన్‌లో వున్న నటి ఎవరో తెలిసినా చెప్పేందుకు ధైర్యం లేక పిసుక్కుంటున్నారట

Son of Review : ఫాదర్ అండ్ సన్ ఎమోషన్‌గా సన్ ఆఫ్ చిత్రం - రివ్యూ..

Pawan Kalyan battula: ఇలస పులస దేవనాయకి అంటూ సాగే పురుషః సాంగ్

Kiara Advani: టాక్సిక్ ది మూవీ వన్ నుండి తబాహి పాటలో యాష్, కియారా అద్వానీ - ది బెస్ట్ షాట్

Janhvi Kapoor: టాలెంట్ మేనేజ్‌మెంట్ వ్యాపారం ఒక విష వలయం : కరణ్ జోహార్

Show comments