ప్రేమించుకుంటారు... విడిపోదామనుకున్నా భయపడి కలిసి బతికేస్తుంటారు... ఎందుకంటే?

ప్రేమలో రకాలున్నాయని మానసిక నిపుణులు అంటున్నారు. ప్రేమలో మన్మథ ప్రేమ, రొమాంటిక్ ప్రేమ, సాహస ప్రేమ, సమాజం కోసం ప్రేమ అనే రకాలున్నాయని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు. వీటిలో మన్మథ ప్రేమ ఎలా ఉంటుందంటే.. ఈ తరహా ప్రేమ జంటలు ప్రేమ కోసమే బతుకుతారు. రతీ మన

Webdunia
శనివారం, 17 జూన్ 2017 (16:53 IST)
ప్రేమలో రకాలున్నాయని మానసిక నిపుణులు అంటున్నారు. ప్రేమలో మన్మథ ప్రేమ, రొమాంటిక్ ప్రేమ, సాహస ప్రేమ, సమాజం కోసం ప్రేమ అనే రకాలున్నాయని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు. వీటిలో మన్మథ ప్రేమ ఎలా ఉంటుందంటే.. ఈ తరహా ప్రేమ జంటలు ప్రేమ కోసమే బతుకుతారు. రతీ మన్మథులుగా ప్రతిక్షణం ఒకరి కోసం మరొకరుగా బతుకుతారు. ఇందులో వారి వ్యక్తిగత లోపాల ప్రశ్నంటూ వుండదు.
 
రొమాంటిక్ ప్రేమ విషయానికి వస్తే.. ఇది ప్రేమ కోసం ప్రేమ. కలిసి వున్నప్పుడు వీరికి ఒకరి మీద మరొకరికి వల్లమాలిన ప్రేమ పుడుతుంది. దూరంగా ఉన్నప్పుడు అంతగా వుండకపోవచ్చు. సాహస ప్రేమికులు.. వీరికి ప్రేమించడం ఒక సాహసం. ప్రేమించి పెళ్ళి చేసుకోవడం ఒక ఘనకార్యం. అందుకోసమే ప్రేమలో పడతారు. పెళ్ళి తర్వాత కూడా ఇతరులతో ప్రేమాయణం నడపగలిగిన శక్తివంతులు.
 
సమాజం కోసం ప్రేమ.. ఒకసారి ప్రేమలో పడిన తర్వాత మధ్యలో తిరిగి ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా సర్దుకుపోయే ప్రేమికులు వీరు. ప్రేమించుకుని తిరిగి విడిపోయారని సమాజం వేలెత్తి చూపుతుందనే భయంతో ప్రేమను కొనసాగిస్తారు. అవతలివారిచ్చే భద్రత నుంచి ప్రేమ పుట్టుకువస్తుందని మానసిక నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మగాళ్లు కూడా వీధి కుక్కల్లాంటివారు.. ఎపుడు అత్యాచారం - హత్య చేస్తారో తెలియదు : నటి రమ్య

ఏం దేశం వెళ్లిపోదాం? ఆలోచిస్తున్న ఇరాన్ ప్రజలు, ఎందుకు?

తెలంగాణ మహిళా మంత్రులను సన్మానించిన మాజీ సీఎం కేసీఆర్... ఎందుకో తెలుసా?

కుక్కల కంటే పిల్లుల్ని పెంచుకోమన్న సుప్రీం.. సంగారెడ్డిలో బాలుడిపై వీధికుక్కల దాడి

ISRO PSLV-C62: పీఎస్‌ఎల్‌వి-సి62 రాకెట్ ద్వారా ఈఓఎస్-ఎన్1 ప్రయోగం.. ఎప్పుడంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha : మా ఇంటి బంగారంలో సమంత.. అంతా రాజ్ నిడిమోరు చేస్తున్నారా?

Srivishnu: జాతకాలను జీవితానికి మిళితం చేస్తూ.. దేఖో విష్ణు విన్యాసం సాంగ్ ఆవిష్కరణ

ఫూలే సినిమా సేవా స్ఫూర్తి కలిగిస్తుంది : నిర్మాత పొన్నం రవిచంద్ర

Havish: రాజాసాబ్ థియేటర్లలో హవిష్ చిత్రం నేను రెడీ ఎక్స్‌క్లూజివ్ టీజర్ ప్రదర్శన

Yash: టాక్సిక్ టీజర్ లో శ‌శ్మానంలో గ‌న్స్‌తో మాఫియా పై యశ్ ఫైరింగ్

తర్వాతి కథనం
Show comments