Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లాటోనిక్ లవ్... ప్రేమకు కావలసినంత మసాలా

వాళ్లిద్దరి మధ్య లైంగిక సంబంధం ఉండదు

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
WD
నేటి మోడ్రన్ లవ్ వరల్డ్‌లో అధికులు "ప్లాటోనిక్ లవ్"లో పడి కొట్టుమిట్టాడుతున్నారని అంటున్నారు మానసిక నిపుణులు. ఇంతకీ ఏమిటీ ప్లాటోనిక్ లవ్..? ఎలా ఉంటుంది...?

" ప్లాటోనిక్ లవ్"లో లైంగిక సంబంధాలు ఉండవు. కేవలం మానసిక సంబంధం మాత్రమే. శరీరాల స్పర్శ కూడా ఉండదు. అయితే ఆ ఇద్దరి మధ్య మాత్రం ప్రేమికులకు మించిన సాన్నిహిత్యం ఉంటుంది. ఇటువంటి విచిత్రమైన సంబంధాల స్వరూపాలను అర్థం చేసుకోవడం కొంత కష్టమే.

ఇలాంటి సంబంధాలు గురించి అనేక అనుమానాలు, రకరకాల అపార్థాలు రావడం జరుగుతుంటుంది కూడా. కానీ నేటి సమాజంలో ఇటువంటి ప్రేమ అక్కడక్కడా మొగ్గలు తొడుగుతోంది.

మన దేశంలో ఈ ప్లాటోనిక్ లవ్‌ను బాలీవుడ్ సినిమాల్లో తెరకెక్కించారు. "హమ్ తుమారే హై సనమ్"లో షారుక్, మాధురీ, సల్మాన్‌ల మధ్య నడిచే సన్నివేశాలు ఇటువంటి ప్రేమనే సూచిస్తాయి. ఇక మామూలు ప్రపంచంలోకి వస్తే, నేడు ఎవరికివారు ఉద్యోగాలు చేస్తూ బిజీగా ఉండాల్సిన పరిస్థితి.

ఇటువంటి సమయంలో చాలా కార్యాలయాల్లో స్త్రీ, పురుషులు పరస్పరం స్నేహంగా మెలగాల్సిన అవసరం మరీ ఎక్కువ. అయితే ఆ స్నేహం... "ఇంటిమేట్ అండ్ ఎఫెక్షనేట్ బట్ నాట్ సెక్సువల్" స్థాయికి వెళ్లిపోతోంది. దీనినే ప్లాటోనిక్ లవ్ అని అంటున్నారు.

ఇక్కడ తోటి ఉద్యోగిణితో మరో ఉద్యోగి చనువుగా ఉండటం జరుగుతుంటుంది. అయితే వారి ప్రవర్తన కొంతమందిలో అనుమానం రేకిత్తించేదిగా ఉంటుంది. అయితే వారివారి భాగస్వాములకు అసలు విషయం తెలుసు. కానీ ఇది ఎదుటి వాళ్లకు ఓ పట్టాన అర్థం కాదు.

అందుకే అటువంటి వాళ్లు ఇది ఓ మానసిక వ్యభిచార రుగ్మతగా ప్రచారం చేస్తుంటారు. కానీ వాళ్లకు అర్థమయ్యే రీతిలో దాన్ని విడమరిచి చెప్పగల స్థితిలో ప్లాటోనిక్ లవ్ జంటలు ఉండవు. ఎందుకంటే కోడి భాష కోడికే తెలుస్తుంది. కుక్క భాష కుక్కకే తెలుస్తుంది. మరి ఈ బంధాన్ని ఏమని పిలవాలి అని చాలామంది నిపుణులు తల బద్దలు కొట్టుకుని చివరికి "ఎక్స్‌స్ట్రా మెటీరియల్ ఎఫైర్స్" అని నామకరణం చేసి పారేశారు.

వారి అభిప్రాయాన్నిబట్టి ఈ సంబంధం అవసరాన్ని బట్టి తన రూపురేఖలను మార్చుకుంటుంది. కాలంతో పాటు తన స్వరూపాన్ని మార్చుకుని సాగిపోతుంది. మొత్తమ్మీద ఈ ప్లాటోనిక్ లవ్ సమాజంలో చాలాచోట్ల పెరిగి వృక్షంగా మారిపోయిందంటున్నారు మానసిక నిపుణులు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

డబ్బు కోసం దుబై వెళ్లావ్, ఇక్కడున్న నాకు ఎవరితోనో లింక్ పెట్టావ్, చనిపోతున్నా: వివాహిత ఆత్మహత్య

భర్త హత్య కోసం యూట్యూబ్‌ వీడియోలు వీక్షించిన భార్య.. చివరకు గడ్డి మందు చెవిలో పోసి...

మద్యం మత్తులో 68 యేళ్ల అత్తపై అల్లుడి లైంగికదాడి..

ధరాలి పర్వత గ్రామంలో సహాయక చర్యలు.. ఒకరు మృతి 150మంది సేఫ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

ఎలాంటి పాత్రను ఇచ్చినా చేయడానికి సిద్ధం : నటుడు ప్రవీణ్‌

యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి తో మంచు మనోజ్ అనౌన్స్‌మెంట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా