Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీవీ సింధుకు 2016లో కనకవర్షం.. రియోలో రజతం.. సెలెబ్రిటీల సరసన చేరిపోయిన తెలుగమ్మాయి..

పీవీ సింధు.. హైదరాబాదీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. టెన్నిస్‌లో రారాణిగా సానియా మీర్జా ఓ వెలుగు వెలుగుతుంటే.. బ్యాడ్మింటన్‌లో మరో హైదరాబాదీ స్టార్ సైనా నె

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2016 (14:39 IST)
పీవీ సింధు.. హైదరాబాదీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. టెన్నిస్‌లో రారాణిగా సానియా మీర్జా ఓ వెలుగు వెలుగుతుంటే.. బ్యాడ్మింటన్‌లో మరో హైదరాబాదీ స్టార్ సైనా నెహ్వాల్‌ను పీవీ సింధు అధిగమించింది. ఇందుకు ప్రధాన కారణం ఆమె కోచ్ గోపిచంద్. సైనా నెహ్వాల్ గోపిచంద్‌ను కోచ్‌గా వద్దని.. విమల్‌ కుమార్‌‌ను కోచ్‌గా ఎంచుకుంది. అయినా గోపిచంద్ మిన్నకుండిపోయాడు. పీవీ సింధును ధీటుగా రాణించేందుకు రంగం సిద్ధం చేశాడు. పీవీ రామన్ (సింధు తండ్రి)ని పీవీ సింధు ఆటతీరును మెరుగుపరచాలనుకున్న తపనను గ్రహించాడు. 
 
1986 ఆసియన్ గేమ్స్‌లో వాలీబాల్ ద్వారా భారత్‌కు రజత పతకాన్ని సాధించిపెట్టిన పీవీ రామన్.. గోపిచంద్‌తో తన బిడ్డ ఆటకు ప్రాధాన్యత పెరగాలని ఒక్క మాటే చెప్పాడు. గోపిచంద్ ఆ మాటకు విలువనిచ్చి.. రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధుచేత రజత పతకాన్ని సొంతం చేసుకునేలా చేశాడు. ఇందుకు పీవీ సింధు తీవ్రంగా శ్రమించింది. తండ్రికల, కోచ్ గోపిచంద్ మాటలను శిరసావహించి.. మెరుగైన ఆటతీరును ప్రదర్శించి ఈ ఏడాదిని తనకు అనుకూలంగా మలుచుకుంది. బ్యాడ్మింటన్ పవర్ హౌస్‌గా పేరు సంపాదించిన చైనా ఆటగాళ్లకు చుక్కలు చూపించే దిశగా గతంలో సైనాను.. ప్రస్తుతం పీవీ సింధును సిద్ధం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సింధు రియోలో రజతం సాధించింది. అంతేగాకుండా రియో క్వార్టర్‌లో చైనా క్రీడాకారిణి వాంగ్-యిహాన్‌ (ప్రపంచ రెండో ర్యాంకర్)ను మట్టికరిపించింది.
 
''నీ వల్ల అవుతుంది'' అనే మంత్రంతో పీవీ సింధును ముందుకు తీసుకెళ్లిన గోపిచంద్.. రియో సెమీస్‌లోనూ చైనా లి-ఎక్సురైను ఓడించింది. ఇక ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి నోజోమీ చేతిలో ఓడినా రజతంతో సొంత గడ్డపై అడుగుపెట్టింది. అక్కడ నుంచి పీవీ సింధు సీన్ మారిపోయింది. భారీ ప్రైజ్ మనీలు, ప్రభుత్వాల నుంచి భారీ నజరానాలు, ప్రైవేట్ కార్యక్రమాల్లో ముఖ్యఅతిథిగా.. పీవీ సింధు రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇంకా ఫ్యాషన్‌లోనూ తన పాపులారిటీని పెంచుకుంది. ఆటతో పాటు ఫ్యాషన్‌లో పీవీ సింధు అదరగొడుతూ.. భారతీయ క్రీడాకారులకు రోల్ మోడల్‌గా నిలిచింది. ఇటీవల కెమెరా ముందు స్టిల్స్‌తో ఆకట్టుకుంటూ.. ఈవెంట్లలోనూ మెరుగ్గా ఆడుతూ మంచి మార్కులు కొట్టేస్తోంది. ఆఫ్ ది ఫీల్డ్‌లో సింధు ప్రత్యేకతను చాటుకుంటూ వివిధ రకాల డ్రస్సుల్లో స్టైల్‌గా కనిపిస్తోంది. రియో ఒలింపిక్స్ తర్వాత సింధు స్టైలే మారిపోయింది. బ్రాండ్ అంబాసిడార్‌గా కేక పుట్టిస్తోంది. 
 
ఫోటో షూట్‌లలోనూ తళుక్కుమంటోంది. ఇటీవలే ఎలై మ్యాగజైన్ డిసెంబర్ కవర్ పేజీకి కూడా ఎక్కింది. ఫ్యాషన్‌లో ట్రెండ్ సెట్టర్‌గా మారిపోతోంది. సెలెబ్రిటీల సరసన నిలిచిపోయింది. మొత్తానికి 2016 సీజన్ సింధుకు బాగా కలిసొచ్చిందని క్రీడా పండితులు అంటున్నారు.

ఇక రియో ఒలింపిక్స్‌కు తర్వాత పీవీ సింధు తన ఆటతీరును సైతం అదే జోరున కొనసాగించింది. ఇందులో భాగంగా తన కెరీర్‌లో తొలిసారి సూపర్ సిరీస్ టిటైల్‌ను సాధించింది. చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ఫైనల్లో విజేతగా నిలిచింది. నవంబరులో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో పదకొండో ర్యాంకర్ సింధు 21-11, 17-21, 21-11 తేడాతో తొమ్మిదో ర్యాంకర్ సున్ యు (చైనా)పై గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇక హాంకాంగ్, దుబాయ్ టోర్నీలోనూ తనదైన శైలిలో పీవీ సింధు మెరుగ్గా రాణించింది. 
 
ఇదిలా ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు అత్యధికంగా సెర్చ్‌ చేసిన ప్రముఖుల జాబితాను గూగుల్‌ ఇటీవలే ప్రకటించింది. ఈ జాబితా టాప్‌-10లో రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన బ్యాట్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు రెండోస్థానంలో నిలిచింది. ఇలా ఆటతీరుతో పాటు మెల్ల మెల్లగా ఫ్యాషన్‌లోనూ తనదైన ముద్రవేసుకుంటూ ముందుకెళ్తున్న పీవీ సింధుకు 2016 బాగా కలిసొచ్చిందని క్రీడా పండితులు చెప్తున్నారు. ఇదే జోరును 2017లోనూ పీవీ సింధును కొనసాగించాలని ఆశిద్దాం.. 

పీవీ సింధు రికార్డులు.. 
2016లో పీవీ సింధు 2013కి తర్వాత మలేషియన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్ గెలుచుకుంది.

ఈ టోర్నీ ఫైనల్‌‍లో స్కాట్లాండ్‌కు చెందిన క్రిస్టీ గిల్మోర్‌పై పీవీ సింధు గెలుపును నమోదు చేసుకుంది. మలేషియన్ గ్రాండ్ ప్రిక్స్ టైటిల్‌తో 2016లో పీవీ సింధు శుభారంభం చేసింది. 
 
రియో ఒలింపిక్స్ 2016 
రియోలో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన సైనా నెహ్వాల్ గాయాల కారణంగా రెండో రౌండ్‌తోనే ఇంటిదారి పట్టడంతో.. దేశానికి పీవీ సింధు పతకం సాధించిపెట్టింది.

తొమ్మిదో సీడ్‌గా బరిలోకి దిగిన పీవీ సింధు.. జపాన్ క్రీడాకారిణి నోజోమీ చేతిలో ఓడినా రజతం ఖాయం చేసుకుంది. 
 
చైనా ఓపెన్ 2016 
సింధు తొలిసారిగా తన కెరీర్‌లో సూపర్ సిరీస్ టైటిల్‌ను సాధించింది. తద్వారా 30 ఏళ్లుగా సూపర్ సిరీస్ ఖాతా తెరువని భారత క్రీడాకారులకు పీవీ సింధు మార్గదర్శకంగా నిలిచింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యాడ్ స్క్వేర్ చిత్రం నుండి స్వాతి రెడ్డి.. గీతం విడుదల

అమెరికా, ఆస్ట్రేలియా లో కూడా రిలీజ్ కాబోతున్న పా.. పా.. మూవీ

ట్రెండింగ్‌లో సంక్రాంతికి వస్తున్నాం.. వెంకీ ఫన్నీ వీడియో వైరల్ (video)

Simran Singh: ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ సిమ్రాన్ సింగ్ ఆత్మహత్య.. ఉరేసుకుంది.. ఆ లెటర్ కనిపించలేదు.. (video)

తెలుగు సీరియల్ నటిని వేధించిన కన్నడ నటుడు చరిత్ అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు పారిశ్రామికవేత్త శ్రీ మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

తర్వాతి కథనం
Show comments