కుంకుమ పెట్టుకుంటున్నారా! మహిళలూ జాగ్రత్త!

భారతీయ మహిళలు తమ ముఖానికి, పాపిటలో కుంకమను పెట్టుకుంటారు. ఆధ్యాత్మికంగా ఉపయోగిస్తారు. పండగలు, ఉత్సవాలు జరిగినప్పుడు ఒకరి మీద ఒకరు చల్లుకుంటారన్న సంగతి తెలిసిందే.

Webdunia
ఆదివారం, 24 సెప్టెంబరు 2017 (10:21 IST)
భారతీయ మహిళలు తమ ముఖానికి, పాపిటలో కుంకమను పెట్టుకుంటారు. ఆధ్యాత్మికంగా ఉపయోగిస్తారు. పండగలు, ఉత్సవాలు జరిగినప్పుడు ఒకరి మీద ఒకరు చల్లుకుంటారన్న సంగతి తెలిసిందే. 
 
అయితే, కుంకుమ, సింధూరంలో సీసం స్థాయి ప్రమాదకర రీతిలో ఉంటోందని అమెరికాలోని రాట్జర్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు వెల్లడించారు. అధిక మోతాదులో ఉండే సీసం వల్ల పిల్లల్లో ఐక్యూ లెవల్స్‌ పడిపోయి, ఎదుగుదల ఆలస్యం అవుతోందన్నారు. 
 
అమెరికాలో సేకరించిన 83 శాతం, భారత్‌లో సేకరించిన 78 శాతం కుంకుమ నమూనాల్లో ఒక గ్రాములో 1.0 మైక్రోగామ్‌ సీసం ఉందన్నారు. న్యూజెర్సీలో 19 శాతం, భారత్‌లోని 43 శాతం నమూనాల్లో ఒక గ్రాముకు 20 మైక్రో గ్రాములు సీసం ఉందని కనుగొన్నారు. ఇది అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) నిర్దేశించిన పరిమితి కన్నా చాలా ఎక్కువని పేర్కొన్నారు. 
 
దీనిపై విశ్వవిద్యాలయం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డెరెక్‌ షెండెల్‌ మాట్లాడుతూ.. శరీరంపై భారీ లోహాల పొడులు పడితే మూత్రపిండాలు, కాలేయ, చర్మ వ్యాధులకు దారితీస్తాయని తెలిపారు. జన్యు విధ్వంసం, చర్మానికి పుళ్లు పడడం, గోర్లు, దంతాలు పాడవుతాయని వెల్లడించారు. 
 
భారత్‌, పాకిస్థాన్‌, తూర్పు, మధ్య, దక్షిణాసియా దేశాల్లో ఈ సమస్యలు ఎక్కువ ఉంటాయి. తక్కువ నాణ్యత కలిగిన కాస్మొటిక్స్‌లో సీసం, పాదరసం, క్రోమియం, కాడ్మియం, జింక్‌ లోహాలు ఎక్కువ ఉంటాయి. చిన్నారులను వీటికి దూరంగా ఉంచాలని పరిశోధకులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దారుణం, స్నానం చేస్తున్న ఏనుగుల మధ్య ఘర్షణలో చిక్కుకుని మహిళ మృతి, వీడియో

మే 22 నుంచి మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్న సీఎం విజయ్

35మంది ఉగ్రవాదులను హతమార్చిన పాకిస్తాన్ భద్రతా దళాలు

ఇంధన పొదుపు మంత్రం : 2 కిలోమీటర్లు నడిచిన సిక్కిం సీఎం తమాంగ్

మూడో బిడ్డకు 30 వేలు, నాలుగో బిడ్డకు 40 వేలు ఎటు పోతాయో? ఒక్కరికే 30 లక్షలవుతుంటే...

అన్నీ చూడండి

లేటెస్ట్

శేషాచలం కొండల్లో 89.4 శాతం పచ్చదనం.. టీటీడీని అభినందించిన సీఎం బాబు

సోమవారం శివ నామ స్మరణతో కలిగే లాభాలేంటో తెలిస్తే?

18-05-2026 సోమవారం ఫలితాలు - విలాసాలకు ఖర్చుచేస్తారు.. చెల్లింపుల్లో జాగ్రత్త...

17-05-2016 ఆదివారం ఫలితాలు - మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి..

17-05-2026 నుంచి 23-05-2026 వరకు మీ వార ఫలితాలు

తర్వాతి కథనం
Show comments