Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి దర్శనం: 2నెలల టోకెన్లు 22వ తేదీ ఆన్‌లైన్‌లో విడుదల

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (21:19 IST)
తిరుమల శ్రీవారి దర్శనానికి గాను నవంబరు, డిసెంబరు నెలలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం(ఎస్ఈడి) టోకెన్లను అక్టోబరు 22వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. 
 
నవంబరు నెలకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు అక్టోబరు 23వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. అలాగే.. తిరుమలలో వసతికి సంబంధించి నవంబరు నెల కోటాను అక్టోబరు 25వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయడం జరుగుతుందని టీటీడీ తెలిపింది.
 
ఇదిలావుంటే.. డిసెంబరు 8 వ తేదీ తిరుచానూరు పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం, డిసెంబరు 16వ తేదీ ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. ఈ రెండు రోజులకు సంబంధించి శ్రీవారి ఆలయ కార్యక్రమాలు ఇంకా ఖరారు కాలేదు. 
 
ఈ కార్యక్రమాల వివరాలు ఖరారయ్యాక డిసెంబరు 8, 16 వ తేదీలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. భక్తులు ఈ విషయం గుర్తించి స్వామి వారి దర్శనం టోకెన్లు, తిరుమలలో వసతి బుక్ చేసుకోవాలని టీటీడీ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

వారం రోజుల్లో ఏపీ పదవ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలు

వడదెబ్బను రాష్ట్ర విపత్తుగా ప్రకటిస్తూ తెలంగాణ ఉత్తర్వులు

వర్షిణిని పెళ్లాడిన లేడీ అఘోరి - వీడియో ఇదిగో...

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అనారోగ్యం.. కేబినేట్ సమావేశాల సంగతేంటి?

అన్నీ చూడండి

లేటెస్ట్

12-04-2025 శనివారం మీ రాశిఫలాలు : వివాదాలు సద్దుమణుగుతాయి...

ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవి వచ్చిన దారినే ఎందుకు వెళ్లిపోతుందో తెలుసా?

టీటీడీ గోశాలలో 100కి పైగా ఆవులు చనిపోయాయా? అవన్నీ అసత్యపు వార్తలు

హనుమజ్జయంతి ఎప్పుడు.. పూజ ఎలా చేయాలి?

11-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : ఆశలు ఒదిలేసుకున్న ధనం?

తర్వాతి కథనం
Show comments