Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే ప్రధాన అర్చకుడుగా రమణదీక్షితులు.. అర్థరాత్రి జీవో జారీ

Webdunia
ఆదివారం, 4 ఏప్రియల్ 2021 (11:40 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) మరో కీలక నిర్ణయం తీసుకుంది. అర్థరాత్రి జీవోను జరీ చేసి, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడుగా రమణ దీక్షితులుని తిరిగి విధుల్లోకి తీసుకుంది. గ‌తంలో హైకోర్టు ఇచ్చిన‌ తీర్పు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. 
 
గతంలో ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన‌ ప్రధాన అర్చకులతో పాటు ఇత‌ర‌ అర్చకులు విధుల్లో చేరాలని టీటీడీ తెలప‌డంతో ప్రధాన అర్చకుడి హోదాలో రమణ దీక్షితులు తిరిగి విధుల్లో చేరారు.
 
అయితే, ప్రస్తుతం గొల్లపల్లి వంశం నుంచి ప్రధాన అర్చకులుగా వేణుగోపాల్ దీక్షితులు కొనసాగుతున్నారు. ఆయ‌న పర్మినెంట్ ఉద్యోగి కావడంతో అధికార బదలాయింపులో ఎలాంటి మార్పులు చోటుచేసుకోబోవ‌ని ఆలయ అధికారులు తెలిపారు. 
 
కాగా, 65 ఏళ్లు దాటిన అర్చకులు పదవీ విరమణ చేయాల‌ని 2018 మే 16న అప్పటి ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. ఈ నేప‌థ్యంలో అప్ప‌ట్లో టీటీడీతో పాటు గోవింద రాజ‌స్వామి ఆలయం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు నిండిన‌ అర్చకులంద‌రూ రిటైర్ అయ్యారు. 
 
వారిలో రమణ దీక్షితులతో పాటు ఆయా ఆలయాల నుంచి 10 మంది మిరాశీ వంశీకులు, నాన్‌మిరాశీ అర్చకులు మరో 10 మంది విధుల నుంచి త‌ప్పుకున్నారు. దీంతో అప్ప‌ట్లోనే వారి స్థానంలో  తిరుమ‌ల వెంక‌టేశ్వ‌రుడి ఆలయ ప్రధాన అర్చకులుగా పైడిపల్లి వంశం నుంచి ఏఎస్‌ కృష్ణ శేషాచల దీక్షితులు, గొల్లపల్లి వంశం నుంచి వేణుగోపాల్ దీక్షితులు, పెద్దింటి శ్రీనివాస దీక్షితులు, తిరుపతమ్మ కుటుంబం నుంచి గోవిందాచార్యులు నియమితుల‌య్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత

ఓ సాదాసీదా ఆర్టీఓ కానిస్టేబుల్: ఇంట్లో రూ. 11 కోట్లు నగదు, 52 కేజీల బంగారం, 234 కిలోల వెండి, ఎలా వచ్చాయి?

వివాదాలతో పని ఏల? వినోదం వుండగా: పుష్ప 2 కలెక్షన్ పై రిపోర్ట్

బంగాళాఖాతంలో అల్పపీడనం: రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు

డీఎంకేను గద్దె దించే వరకు చెప్పులు వేసుకోను : బీజేపీ నేత శపథం!!

అన్నీ చూడండి

లేటెస్ట్

22-12-2024 ఆదివారం దినఫలితాలు - రుణ సమస్యలు తొలగిపోతాయి..

Weekly Horoscope: 22-12-2024 నుంచి 28-12-2024 వరకు ఫలితాలు- మీ మాటలు చేరవేసే వ్యక్తులు?

21-12-2024 శనివారం దినఫలితాలు : ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి...

తిరుమల కోసం స్వర్ణ ఆంధ్ర విజన్-2047: టీటీడీ ప్రారంభం

19-12-2024 గురువారం దినఫలితాలు : పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండండి..

తర్వాతి కథనం
Show comments