శ్రీవారికి మినహాయింపు లేదు.. ఆయన కూడా పన్ను చెల్లించాల్సిందే : అరుణ్ జైట్లీ

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం నంచి తిరుమల వెంకన్నకు మినహాయింపునిచ్చే ప్రసక్తేలేదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తేల్చి చెప్పారు. ఆయనకు మినహాయింపునిస్తే... దేశంలోని ఇతర దేవుళ్లకు కూడా ఇదే నియమా

Webdunia
సోమవారం, 12 జూన్ 2017 (10:04 IST)
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) విధానం నంచి తిరుమల వెంకన్నకు మినహాయింపునిచ్చే ప్రసక్తేలేదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తేల్చి చెప్పారు. ఆయనకు మినహాయింపునిస్తే... దేశంలోని ఇతర దేవుళ్లకు కూడా ఇదే నియమాన్ని వర్తింపజేయాల్సి ఉంటుందన్నారు. అలాగే, తిరుపతి లడ్డూ తయారీకి ఉపయోగించే వస్తువులపై కూడా పన్ను మినహాయింపు ఇవ్వలేమన్నారు. 
 
అందువల్ల వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి అమలులోకి రానున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పరిధి నుంచి తిరుమల దివ్యక్షేత్రాన్ని మినహాయించే ప్రసక్తేలేదని జైట్లీ స్పష్టంచేశారు. టీటీడీకి మినహాయింపు కుదిరేపనికాదని, టీటీడీని మినహాయిస్తే, దేశంలోని మిగతా సంస్థలన్నీ ఇదే కోరిక కోరతాయన్నారు.
 
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) నుంచి ఆథ్యాత్మిక క్షేత్రమైన తిరుమలను మినహాయించాలని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఆదివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో జైట్లీకి వినతిపత్రాన్ని అందించారు. దీన్ని పరిశీలించిన జైట్లీ.. పైవిధంగా వ్యాఖ్యానించినట్టు సమాచారం. అయితే, యనమల సమర్పించిన వినతిపత్రంపై వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Vizag: కైలాసగిరి కొండలపై కాంటిలివర్ గాజు వంతెన ప్రారంభం

ఐదేళ్ల చిన్నారిపై పాశవికంగా దాడి చేసిన ఆయా

మహిళా వ్యాపారవేత్తను తుపాకీతో బెదిరించి, దుస్తులు విప్పించి లైంగిక వేధింపులు..

భర్తను హత్య చేసిన భార్య.. గొడవలే గొడవలు.. ఇంట్లోకి రానివ్వకపోవడంతో..?

కుమార్తెను ప్రేమిస్తున్నాడనీ యువకుడిని చంపేశారు... అయినా శవాన్నే పెళ్లి చేసుకున్న యువతి...

అన్నీ చూడండి

లేటెస్ట్

29-11-2025 శనివారం ఫలితాలు - తీర్ధయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు...

భగవద్గీత ఇదిగో అనగానే ఆ అమ్మాయిలు ఏం చేసారో చూడండి (video)

Sabarimala: శబరిమల ట్రెక్కింగ్ మార్గాల్లో 65 పాములను పట్టేశారు.. భక్తుల కోసం వివిధ బృందాలు

Chanakya Neeti for Women : చాణక్య నీతి ప్రకారం మహిళలు ఇలా జీవించాలట

28-11-2025 శుక్రవారం ఫలితాలు - లక్ష్యసాధనకు పట్టుదల ప్రధానం...

తర్వాతి కథనం
Show comments