కరోనా వైరస్ కట్టడికి తితిదే చర్యలు - భక్తులకు కరోనా పరీక్షలు

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (10:57 IST)
కరోనా వైరస్ తిరుమల గిరుల్లో వ్యాపించకుండా ఉండేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులోభాగంగా, ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ద్వారా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
 
సిబ్బందికి రోజూ కరోనా టెస్టులు నిర్వహించడమే కాకుండా, టీటీడీలో ప్రత్యేక దవాఖాన ఏర్పాటు చేసేందుకు ఆలోచన చేస్తున్నారు. లాక్డౌన్‌ సడలింపుల్లో భాగంగా తిరుమలలో స్వామి వారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తుండడంతో టీటీడీ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. 
 
శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. ఇక ఉద్యోగుల ఆరోగ్య దృష్ట్యా రోజుకు వంద మంది ఉద్యోగులకు కొవిడ్‌ పరీక్షలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ తెలిపారు. 
 
ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలనే నిర్ణయం కూడా తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. బర్డ్ దవాఖానాను కరోనా రోగులకు ఉపయోగించేలా నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. అలాగే, తిరుమలకు వచ్చే భక్తులందరికీ విధిగా ధర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే లోనికి అనుమతించాలని నిర్ణయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బొత్స సత్యనారాయణ గారు నమస్కారం.. నారా లోకేష్ ఆత్మీయ పలకరింపు

ఇద్దరు స్నేహితుల సరదా పెను ప్రమాదానికి దారితీసింది (వీడియో)

ఇరాన్ పని ముగించి క్యూబా సంగతి చూస్తా: డొనాల్డ్ ట్రంప్

వైకాపా విధ్వంసంతో నవ్యాంధ్ర 30 యేళ్లు వెనక్కి వెళ్లింది : పవన్ కళ్యాణ్

13 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ లేదు

అన్నీ చూడండి

లేటెస్ట్

03-03-2026 మంగళవారం ఫలితాలు - కష్టానికి తగిన ప్రతిఫలం ఖాయం..

హోలీ మార్చి 4వ తేదీన జరుపుకోవాలట.. ఎందుకంటే.. సంపూర్ణ చంద్రగ్రహణం?

మార్చి 3న చంద్రగ్రహణం-మళ్లీ సంపూర్ణ చంద్రగ్రహణం 2028 డిసెంబరు 31న మాత్రమే

02-03-2026 సోమవారం ఫలితాలు : కార్యసిద్ధికి సంకల్ప బలం ముఖ్యం...

01-03-2026 ఆదివారం ఫలితాలు - ఖర్చులు విపరీతం.. పనులు ముందుకు సాగవు...

తర్వాతి కథనం
Show comments