Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముక్కోటి ఏకాదశి : స్థానికులకు పెద్దపీట... 10 రోజుల వరకు వైకుంఠ దర్శనం!

Webdunia
బుధవారం, 23 డిశెంబరు 2020 (09:09 IST)
ఈ నెల 25వ తేదీన ముక్కోటి ఏకాదశి పర్వదినంరానుంది. దీన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా, వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకు సర్వదర్శనం కల్పించనుంది. అలాగే, వైకుంఠ ద్వారాలను పది రోజుల పాటు తెరిచివుంచనుంది. అంటే డిసెంబరు 25వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు ఈ వైకుంఠ ద్వారం తెరిచివుంటుంది. నూతన సంవత్సర వేడులు కూడా కలిసివచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. 
 
సంప్రదాయానికి భిన్నంగా ఈ దఫా పది రోజులపాటు వైకుంఠ ద్వారాలు తెరవాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయించింది. అలాగే, ఆ 10 రోజులు అధ్యయనోత్సవాలు నిర్వహించనున్న తితిదే... 25న ముక్కోటి ఏకాదశి నుంచి వచ్చే నెల 3న పంచమి వరకు వైకుంఠ ప్రదక్షిణలో భక్తులను అనుమతించనుంది. ఇందుకోసం టీటీడీ అదనపు ఏర్పాట్లు చేస్తోంది. 
 
ఇకపోతే, ఈ నెల 25 నుంచి జనవరి 3 వరకు ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్లను రోజుకు 20 వేల చొప్పున 2 లక్షల టికెట్లను ఈ నెల మొదటి వారంలో ఆన్‌లైన్‌లో ఉంచింది. అలాగే, శ్రీవాణి ట్రస్టు (రూ.10 వేలు) కింద మరో 18 వేల టికెట్లను జారీ చేయగా, గంటల వ్యవధిలోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
 
అలాగే, సామాన్య భక్తుల కోసం రోజుకు 8 వేల టికెట్లను ఆఫ్‌లైన్ ద్వారా జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. దర్శనానికి ఒక రోజు ముందు నుంచి తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో వీటిని జారీ చేస్తారు. అయితే, ఇవి తిరుమల తిరుపతిలోని స్థానికులకే పరిమితం కానున్నాయి. ఇందుకోసం ఆధార్‌లోని చిరునామాను ప్రామాణికంగా తీసుకోనున్నారు. కాబట్టి ఇతర ప్రాంతాల వారు వచ్చి ఇబ్బంది పడొద్దని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. 

సంబంధిత వార్తలు

పండ్లు ఇస్తున్నట్లు నటిస్తూ చీర పిన్ తీసేవాడు: హెచ్‌డి ప్రజ్వాల్ రేవన్నపై బాధితురాలు ఫిర్యాదు

ఏపీ గురించి పూనమ్ కౌర్ కామెంట్స్.. వైరల్

చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి సెక్యూరిటీ కల్పించాలి : హైకోర్టు

దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ పెన్ డ్రైవ్‌ల్లో వేలాది మహిళల శృంగార వీడియోలు!!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : 30న టీడీపీ - బీజేపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో!!

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

నరదృష్టిని తరిమికొట్టే కంటి దృష్టి గణపతి.. ఉత్తరం వైపు?

24-04-202 బుధవారం దినఫలాలు - విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వల్ల...

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

తర్వాతి కథనం
Show comments