Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి దర్శనం కొనసాగుతుంది : తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (14:59 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో పలువురు అర్చకులు కోరనా వైరస్ బారినపడ్డారు. దీంతో భక్తుల దర్శనం నిలిపివేసి... శ్రీవారికి ఏకాంతంగా మాత్రమే సేవలు నిర్వహించాలని అర్చకులు కోరుతున్నారు. అయితే, తితిదే అధికారులు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. శ్రీవారి దర్శనం యధావిధిగా కొనసాగిస్తున్నారు. 
 
ఈ క్రమంలో ఇటీవల తితిదే మాజీ ప్రధాన దీక్షితులు శ్రీనివాస దీక్షితులు ఇటీవల కరోనా కారణంగా కన్నుమూశారు. ఈ కారణంగా అర్చకులు భయపడుతున్నారు. అదేసమయంలో భక్తులు కూడా శ్రీవారి దర్శనం కోసం వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీనిపై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, భక్తుల ద్వారా కరోనా సోకలేనందున తిరుమల, తిరుపతి దేవస్థానంలో దర్శనాలను నిలుపుదల చేయబోమని స్పష్టం చేశారు. 
 
తిరుపతి పట్టణంలో లాక్డౌన్‌ అమలులో ఉన్నందున భక్తులకు సర్వదర్శనం కోసం జారీ చేస్తున్న టోకెన్లను రద్దు చేస్తున్నామన్నారు. 'తిరుపతి పరిసర ప్రాంతాల భక్తులు దర్శనానికి రావొద్దు, ఆన్‌లైన్‌ ద్వారా టిక్కెట్లు పొందిన భక్తులు మాత్రమే దర్శనానికి రావాలి' అని సూచించారు. ఆన్‌లైన్‌ ద్వారా రోజూ 9 వేల మంది భక్తులకు మాత్రమే అవకాశముందని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 
 
వచ్చే భక్తులను అలిపిరి వద్ద పరీక్షించి కొండపైకి అనుమతి ఇస్తున్నామని, జ్వరం, తదితర అనుమానిత లక్షణాలు ఉంటే వారిని ఆస్పత్రికి తరలిస్తున్నామని సుబ్బారెడ్డి వివరించారు. చిన్నపిల్లలు, వృద్ధులను దర్శనానికి తీసుకురావద్దొని,మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

Couple: బైకుపై అంకుల్-ఆంటీల రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో ఈ లోకాన్ని మరిచిపోయారు.. (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

28-07-2025 సోమవారం ఫలితాలు - మనోధైర్యంతో మెలగండి....

వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర: వీరంభొట్లయ్యను అత్రి మహాముని నుండి పొందుట

27-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యసిద్ధి ఉంది - మాట నిలబెట్టుకుంటారు...

27-07-2025 నుంచి 02-08-2025 వరకు వార ఫలితాలు - అపజయాలకు కుంగిపోవద్దు...

శ్రావణ ఆదివారం ఈ రెండు చేస్తే.. అప్పులుండవు.. కావాల్సిందల్లా బెల్లం మాత్రమే..

తర్వాతి కథనం
Show comments