Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆలయంలో 8 నుంచి తెప్పోత్సవాలు: హుండీలో పడిన రూ.4 కోట్ల పాత నోట్లు మారేనా?

కలియుగ వైకుంఠం తిరుమల వెంకన్న స్వామి ఆలయంలో మార్చి 8వ తేదీ నుంచి 12 వరకు తెప్పోత్సవాలు జరగనున్నాయి. శుక్రవారం నుంచి భక్తులకు 48690 ఆర్జిత సేవా టిక్కెట్లను అందుబాటులో ఉంచినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2017 (11:30 IST)
కలియుగ వైకుంఠం తిరుమల వెంకన్న స్వామి ఆలయంలో మార్చి 8వ తేదీ నుంచి 12 వరకు తెప్పోత్సవాలు జరగనున్నాయి. శుక్రవారం నుంచి భక్తులకు 48690 ఆర్జిత సేవా టిక్కెట్లను అందుబాటులో ఉంచినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సాంబశివరావు వెల్లడించారు. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఉగాది నుంచి మొబైల్‌ యాప్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చన్నారు. కాగా... గత ఏడాది ఫిబ్రవరి కంటే ఈ ఏడాది 40 వేల మంది భక్తులు అధికంగా స్వామివారిని దర్శించుకున్నారని, హుండీ ఆదాయం మాత్రం కొంతమేర తగ్గిందని ఈవో సాంబశివరావు తెలిపారు. 
 
ఇదిలా ఉంటే.. ఆపద మొక్కుల వాడికే పెద్ద ఆపద వచ్చిపడింది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి హుండీలో కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిన పాత 500, 1000 రూపాయల నోట్లు ఏకంగా రూ.4కోట్లు రావడంతో.. ఆ సొమ్మును ఏం చేయాలో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ డబ్బును ఏం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి, రిజర్వు బ్యాంకుకు లేఖలు రాశారు. వాళ్ల నుంచి తగిన సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. 
 
హుండీలో 4 కోట్ల రూపాయలకు పైగా పాతనోట్లు వచ్చినట్లు టీటీడీ ఈఓ సాంబశివరావు తెలిపారు. కాగా రద్దు చేసిన పాతనోట్లు పది కన్నా ఎక్కువ ఉంటే కనీసం 10వేల రూపాయలు లేదా పాతనోట్ల విలువకు రెట్టింపు మొత్తంలో జరిమానా విధిస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఈ లెక్కన చూస్తే టీటీడీకి రూ.8కోట్ల జరిమానా విధిస్తారా లేకుంటే రూ.4కోట్ల పాత నోట్లు తీసుకుని కొత్త నోట్లు ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రమ్యపై అత్యాచార బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్.. దర్శన్ ఏం చేస్తున్నారు?

జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటు వచ్చింది.. వ్యాయామం చేస్తుండగా కుప్పకూలిపోయాడు.. (video)

హిమాచల్ ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు- కాఫర్‌డ్యామ్ కూలిపోయింది.. షాకింగ్ వీడియో

కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో పనిమనిషిపై అత్యాచారం-ప్రజ్వల్‌ రేవణ్ణకు జీవితఖైదు

ఇంట్లో నిద్రిస్తున్న మహిళను కాటేసిన పాము.. ఆస్పత్రికి మోసుకెళ్లిన కూతురు.. చివరికి? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

సముద్రపు తెల్ల గవ్వలు ఇంట్లో పెట్టుకోవచ్చా?

Sravana Masam Fridays 2025: శ్రావణ శుక్రవారం-అష్టమి తిథి-లక్ష్మీదేవితో పాటు దుర్గకు పూజ చేస్తే?

01-08-2025 నుంచి 31-08-2025 వరకు మీ మాస ఫలితాలు

TTD: తిరుమల ఆలయ ప్రాంగణంలో రీల్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: టీటీడీ

Bangles: శ్రావణమాసంలో గోరింటాకు, గాజులు ధరిస్తే?

తర్వాతి కథనం
Show comments