మే 1 నుంచి గోవింద రాజస్వామి ఆలయ దర్శన వేళలు మార్పు

Webdunia
శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (10:33 IST)
మే ఒకటో తేదీ నుంచి తిరుపతి గోవింద రాజస్వామి ఆలయ భక్తుల దర్శన వేళల్లో మార్పులు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆలయ స్పెషల్‌ గ్రేడ్‌ డెప్యూటీ ఈఈఓ రాజేంద్రుడు ఒక ప్రకటనలో తెలిపారు. 
 
కొవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో టీటీడీ స్వామి వారి దర్శన సమయాల్లో మార్పులు చేస్తూ.. ఉప ఆలయాల్లో దర్శనాలు రద్దు చేసింది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలుపుతారు. 
 
అనంతరం 6.30 గంటలకు స్వామి వారికి తోమాల సేవ, సహస్రనామార్చన సేవలు నిర్వహించనున్నారు. ఈ సేవల కాలంలో భక్తులకు లఘు దర్శనం కల్పిస్తారు. ఉదయం 6.30 గంటల నుంచి 9 గంటల వరకు, 9.30 నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు స్వామి వారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తారు. 
 
సాయంత్రం 6 గంటల తర్వాత దర్శనానికి అనుమతించరు. రాత్రి కైంకర్యాలు, ఏకాంత సేవ అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. అలాగే గోవింద రాజస్వామి ఆలయ ప్రాంగణంలోని ఉప ఆలయాల్లో భక్తులకు దర్శనాలను రద్దు చేశారు. భక్తులు విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది. ్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీవారి ప్రసాదంపై యాంకర్ శివజ్యోతి వివాదాస్పద వ్యాఖ్యలు

ఫ్లైఓవర్ పైనుంచి కారు వెళ్తుండగా డ్రైవర్‌కు గుండెపోటు

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర జల సంఘం బృందం

బేగంపేట ఎయిర్‌పోర్టులో మహిళా పైలెట్‌పై అత్యాచారం

పోలీసుల ముందు లొంగిపోనున్న 37మంది మావోయిస్టులు

అన్నీ చూడండి

లేటెస్ట్

19-11-2025 బుధవారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...

శబరిమల: క్యూలైన్లలో లక్షలాది మంది భక్తులు.. నీటి కొరత ఫిర్యాదులు.. ట్రావెన్‌కోర్ ఏమందంటే?

18-11-2025 మంగళవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం.. ఆప్తులను కలుసుకుంటారు...

AxK మ్యూజిక్ వీడియో, ఐగిరి నందిని మరియు కాల భైరవ్ EDM వెర్షన్

సోమ ప్రదోషం.. శివాలయానికి వెళ్లి ఇలా చేస్తే.. కర్మల నుంచి విముక్తి

తర్వాతి కథనం
Show comments