Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 నిమిషాల్లో తిరుమల వేంకటేశుడి దర్శనం... అంతా మోదీ పెద్దనోట్లు రద్దు మహిమ...

చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రాలకు పెట్టింది పేరు. నలుదిక్కులా ఏ వైపుకు వెళ్ళినా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. అలాంటి క్షేత్రాల్లో ప్రస్తుతం భక్తులు కనిపించడం లేదు. కారణం డబ్బులు లేకపోవడం. డబ్బులు లేకపోవడమంటే పాత నోట్లను మార్చుకోలేక, కొత్త నోట్లకు

Webdunia
గురువారం, 17 నవంబరు 2016 (16:44 IST)
చిత్తూరు జిల్లా పుణ్యక్షేత్రాలకు పెట్టింది పేరు. నలుదిక్కులా ఏ వైపుకు వెళ్ళినా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. అలాంటి క్షేత్రాల్లో ప్రస్తుతం భక్తులు కనిపించడం లేదు. కారణం డబ్బులు లేకపోవడం. డబ్బులు లేకపోవడమంటే పాత నోట్లను మార్చుకోలేక, కొత్త నోట్లకు చిల్లర్లు లేక ప్రధాని తీసుకున్న నిర్ణయం కాస్తా భక్తుల ఆధ్మాత్మిక పర్యటనలపై కూడా పడింది.
 
తిరుమలతో పాటు శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీనివాసమంగాపురం, తిరుచానూరు, కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో ఎక్కడా కూడా భక్తుల రద్దీ కనిపించడం లేదు. ఆలయాల్లో పనిచేసే సిబ్బంది తప్ప భక్తులెవరూ లేరు. సాధారణంగా చిన్నచిన్న ఆలయాల్లో అర్చన, అభిషేకాలకు 5 నుంచి 10 రూపాయలు తీసుకుంటారు. అయితే అందుకు సరిపడా చిల్లర తితిదే వద్ద లేదు. భక్తుల్లో కొంతమంది 2 వేల నోటు ఇస్తుంటే ఏం చేయాలో అర్థంకాక భయపడిపోతున్నారు తితిదే ఉద్యోగస్తులు. ఇక చేసేదేమీ లేక వచ్చిన భక్తులను ఉచితంగా పంపించేస్తున్నారు. దీంతో తితిదే ఆదాయానికి గండి పడుతోంది.
 
దీంతోపాటు సొంత వాహనాల్లో వచ్చే భక్తులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్‌, డీజల్‌ బంకులలో కొన్నిచోట్ల పాత నోట్లు తీసుకోకపోవడంతో ఏం చేయాలో పాలుపోక చాలామంది భక్తులు వాహనాలు పార్కింగ్‌లలో ఉంచి వెళ్ళిపోతున్నారు. దీంతో పెద్దనోట్ల ప్రభావం ఆలయాలపై పడింది. నిన్న రాత్రి అయితే తిరుమల శ్రీవారి దర్శనం డైరెక్ట్ లైన్‌ కనిపించింది. అరగంట లోపే శ్రీవారి దర్శనం పూర్తయ్యింది. దీంతో తిరుమలలోని స్థానికులు, కొంతమంది భక్తులు లైన్లలోకి వెళ్ళి మరీ స్వామివారిని దర్శించుకున్నారు. 
 
దీన్నిబట్టి చూస్తే మీకు అర్థమవుతుంది ఆలయంలో ఏ మాత్రం రద్దీ ఉందో. స్థానిక ఆలయాల్లో అయితే ప్రత్యేక ప్రవేశ దర్శనాలను పక్కనబెట్టి ఉచిత దర్సనాన్నే కొనసాగించేస్తున్నారు. క్యూలైన్లలో వెళ్ళే భక్తులు అటెళ్ళి, ఇటు వచ్చేస్తున్నారు. దీనికితోడు చిల్లర గొడవ ఉండడంతో ఒకే దర్శనాన్ని అనుమతించేస్తున్నారు. ఈ చిల్లర కష్టాలు తీరేంత వరకు కూడా తితిదే ఆదాయానికి గండిపడటమే కాకుండా ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపించే అవకాశమే లేదు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments