Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబరు 27 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు : ఈవో ధర్మారెడ్డి

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (16:01 IST)
తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ యేడాది సెప్టెంబరు 27వ తేదీ నుంచి జరుగనున్నాయి. 27న ధ్వజారోహణంతో ఈ వేడుకలు ప్రారంభమవుతాయని తితిదే ఈవో ధర్మ ధర్మారెడ్డి తెలిపారు. 
 
ఆయన శుక్రవారం సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణపై తితిదే అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించామని చెప్పారు. ఈ యేడాది యధావిధిగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని, తిరువీధుల్లో స్వామివారు విహరించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. 
 
ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 1న గరుడసేవ, 2న బంగారు రథం, 4న మహారథం 5న, చక్రస్నానం వేడుకలను నిర్వహిస్తామన్నారు. అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తామని తెలిపారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో దివ్యాంగుల ప్రత్యేక దర్శనాలు, వీఐపీ సిఫార్సు లేఖల దర్శనాలను రద్దు చేస్తున్నామని ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు.

సంబంధిత వార్తలు

ఎమ్మెల్యే రాజాసింగ్‌ ముందస్తు అరెస్టు - విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు

దేవభూమి అనకనందా నదిలో పడిన మినీ బస్సు : 14 మంది మృతి

రుషికొండ ప్యాలెస్ రహస్యం గుట్టు రట్టు... రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా (Video)

ఆ రైల్వే డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు అనేక రైళ్లు రద్దు!!

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరో చేదు అనుభవం... ఫైలుపై సంతకం చేసేందుకు నిరాకరించిన మంత్రి!!

13-06-24 గురువారం దినఫలాలు - ధనం ఎవరికైనా ఇచ్చినా తిరిగి రాజాలదు...

దేవతా వృక్షం రావిచెట్టుకు ప్రదక్షిణ చేసేవారికి ఇది తెలుసా?

12-06-202 బుధవారం దినఫలాలు - దంపతుల మధ్య చికాకులు తలెత్తినా..?

11-06-2024 - మంగళవారం- పంచమి రోజున వారాహిని పూజిస్తే శుభం

12-06-202 బుధవారం దినఫలాలు - దంపతుల మధ్య చికాకులు తలెత్తినా..?

తర్వాతి కథనం
Show comments