Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా లక్ష కుంకుమార్చన

Webdunia
శుక్రవారం, 30 ఆగస్టు 2019 (16:12 IST)
తితిదేకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శ్రావణమాసంలో చివరి శుక్రవారం శ్రీ కామాక్షి అమ్మవారికి ఘనంగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు. 
 
ఇందులో భాగంగా ఆలయంలోని మండపంలో శ్రీ మహాలక్ష్మీఅమ్మవారు, శ్రీ సరస్వతి అమ్మవారు, శ్రీ కామాక్షి అమ్మవార్లను కొలువు దిర్చి కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి అమ్మవారి మూలమూర్తిని గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. 
 
ఉదయం 8.30 నుండి 11.30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4.00 నుండి 6.00 గంటల వరకు లక్ష కుంకుమార్చన చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష సార్లు కుంకుమతో అమ్మవారికి అర్చన చేశారు. ఆ తరువాత సాయంత్రం 6.30 గంటలకు శ్రీ కపిలేశ్వరస్వామివారు, శ్రీ కామాక్షి అమ్మవారు పురవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
 
 ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ భూపతి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: మీరు పని నుంచి ఇంటికొచ్చేలోపు భోజనం సిద్ధంగా వుండాలి.. మహిళలూ ఊహించుకోండి..!

జనసేన పార్టీలో చేరిన పిఠాపురం మాజీ వైకాపా ఎమ్మెల్యే దొరబాబు

మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మనవడు కనిష్క్ రెడ్డి మృతి

Kedarnath Ropeways: కేదార్‌నాథ్ రోప్ వేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. 36 నిమిషాల్లోనే తీర్థయాత్ర

International Women’s Day 2025- అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2025.. థీమ్ ఏంటి? మూలాలు ఎక్కడ..? చరిత్ర ఏంటి?

అన్నీ చూడండి

లేటెస్ట్

శని - రాహువు కలయిక.. అశుభ యోగం.. కన్య, ధనుస్సు రాశి వారు జాగ్రత్త!

వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారా..? ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే.. సూపర్ ఫలితాలు

06-03-2025 గురువారం దినఫలితాలు - కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

Dream: శుభశకునాలను సూచించే కలలు ఇవే.. కలలో శ్రీలక్ష్మి కనిపిస్తే..?

అన్ని రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాలను నిర్మించాలి.. ఉచితంగా భూమి ఇవ్వండి: బీఆర్ నాయుడు

తర్వాతి కథనం
Show comments