Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏకాంతంగా శ్రీవారి పట్టపురాణి బ్రహ్మోత్సవాలు, వాహన సేవలు ఎప్పుడెప్పుడో తెలుసా?

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (22:18 IST)
తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగానే నిర్వహించడానికి టిటిడి సిద్థమైంది. ఈ నెల 11వ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ఉదయాన్నే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా కూడా నిర్వహించింది టిటిడి. ఆలయాన్ని శుద్ధి చేశారు.
 
అయితే బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో ఏయే వాహన సేవలు ఏయే రోజు జరుగుతున్నాయో చూద్దాం. ఈ నెల 11వ తేదీ బుధ‌వారం) ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమై ఆ రోజు సాయంత్రం చిన్నశేషవాహనం జరుగనుంది. 
 
12వ తేదీ గురువారం ఉదయం పెద్దశేషవాహనం.. రాత్రి హంసవాహన సేవ,
13వ తేదీ శుక్ర‌వారం ఉదయం ముత్యపుపందిరి వాహనం, రాత్రి సింహవాహనం,
14వ తేదీ శ‌నివారం ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమంత వాహనం,
15వ తేదీ ఆదివారం ఉదయం పల్లకీ ఉత్సవం రాత్రి గజ వాహన సేవలు జరుగనున్నాయి.
 
అలాగే 16వ తేదీ సోమ‌వారం ఉదయం సర్వభూపాలవాహనం సాయంత్రం స్వర్ణరథం జరుగనున్నాయి. గరుడ వాహనసేవ జరుగనుంది. అంతేకాకుండా 17 మంగ‌ళ‌వారం ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 18వ తేదీ బుధ‌వారం ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహన సేవలు జరుగనున్నాయి.

19వతేదీ గురువారం మధ్యాహ్నం పంచమి తీర్థం వాహ‌న‌మండ‌పంలోనే జరుగనుంది. ఆ తర్వాత ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఇప్పటికే టిటిడి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కరోనా కారణంగా ఏకాంతంగానే ఉత్సవాలను టిటిడి చరిత్రలో మొదటిసారి నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తితిదే పాలక మండలి సభ్యుడుగా సుదర్శన్ వేణు నియామకం

నేపాల్‌లో బద్ధలవుతున్న జైళ్లు.. పారిపోతున్న ఖైదీలు

బైడెన్ అహంకారం వల్లే ఓడిపోయాం : కమలా హారిస్

చంపెయ్... గొంతు పిసికి చంపేసెయ్... మనం ప్రశాంతంగా ఉండొచ్చు... ప్రియుడుని ఉసికొల్పిన భార్య

ప్రియుడితో భార్యను చూసి కుప్పకూలిన భర్త, కాళ్లపై పడి భార్య కన్నీటి పర్యంతం

అన్నీ చూడండి

లేటెస్ట్

Sankatahara Chaturthi 2025: బుధవారం సంకష్టహర చతుర్థి.. ఇలా చేస్తే?

10-09-2025 బుధవారం ఫలితాలు - కీలక పత్రాలు.. నగదు జాగ్రత్త...

09-09-2025 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం....

కలియుగాది ఎప్పుడు వస్తుంది? ఆ రోజున ఏం చేయాలి?

చంద్రగ్రహణం: శుద్ధి కార్యాల తర్వాత ఏపీ-తెలంగాణల్లో తెరుచుకున్న దేవాలయాలు

తర్వాతి కథనం
Show comments