Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆధార్‌తో రండి.. స్వామివారిని దర్శించుకోండి : తితిదే

కలియుగవైకుంఠంలో వెలసివున్న శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు సలుభతరమైన విధానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రవేశపెట్టింది. ఇందులోభాగంగా, ఆధార్ లేదా ఓటరు గుర్తింపు కార్డుతో వచ్చే భక్త

Webdunia
గురువారం, 26 ఏప్రియల్ 2018 (10:51 IST)
కలియుగవైకుంఠంలో వెలసివున్న శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు సలుభతరమైన విధానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ప్రవేశపెట్టింది. ఇందులోభాగంగా, ఆధార్ లేదా ఓటరు గుర్తింపు కార్డుతో వచ్చే భక్తులకు కేవలం రెండు మూడు గంటల్లోనే స్వామి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంది.
 
సాధారణంగా ఎన్నో వ్యయ ప్రయాసలతో తిరుమల గిరులకు చేరుకుని శ్రీ వెంకటేశ్వరుని క్షణకాలంపాటు దర్శించుకునేందుకు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూసే అవసరం ఇక ఉండదు. తితిదే ముందు ప్రకటించినట్టుగా సర్వదర్శనానికి టైమ్ స్లాట్ విధానం గురువారం ఉదయం నుంచి ప్రారంభమైంది. దీని ప్రకారం ఓ భక్తుడు క్యూ కాంప్లెక్స్ లోపలికి ఎన్ని గంటలకు రావాలన్న విషయాన్ని ముద్రిస్తూ, అధికారులు బయో మెట్రిక్ కూపన్ అందిస్తారు. దీన్ని తీసుకుని ఆ సమయానికి లోనికి వెళితే రెండు నుంచి మూడు గంటల్లోపే స్వామిని దర్శించుకుని బయటకు రావచ్చు.
 
ఈ కూపన్ కోసం ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడీ కార్డు తప్పనిసరి చేసింది. ఈ యేడాది ఆరంభంలో సర్వదర్శనానికి టైమ్ స్లాట్ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించిన తితిదే... భక్తుల అభిప్రాయాలను కోరిన వేళ, ఈ పద్ధతి బాగుందన్న సమాధానం వచ్చింది. ఆపై మరింత పకడబ్బందీగా ఈ విధానాన్ని తయారు చేసి, అధునాతన కంప్యూటర్ల సాయంతో, 100కు పైగా టైమ్ స్లాట్ కేటాయింపు కేంద్రాలను తిరుమల, తిరుపతిలలోని పలు ప్రాంతాల్లో ఎంపిక చేశారు. ఈ విధానాన్ని మే మొదటి వారం నుంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రండమ్మా రండి, మందులిచ్చేందుకు మీ ఊరు వచ్చా: ఎంత మంచి వైద్యుడో!!

పెళ్లైన 30 ఏళ్లకు ప్రియుడు, అతడి కోసం భర్తను చంపేసింది

Nikki Bhati: భర్త విపిన్‌కి వివాహేతర సంబంధం? రీల్స్ కోసం నిక్కీ ఆ పని చేసిందా?

Vantara, దర్యాప్తు బృందానికి పూర్తిగా సహకరిస్తాము: వంతారా యాజమాన్యం ప్రకటన

ప్రియురాలి నోట్లో బాంబు పెట్టి పేల్చి చంపేసిన ప్రియుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

24-08-2025 నుంచి 30-08-2025 వరకు మీ వార ఫలితాల - వృత్తి ఉద్యోగాల్లో రాణింపు...

24-08-2025 ఆదివారం మీ రోజువారీ ఫలితాలు

Padmanabhaswamy: శ్రీ పద్మనాభస్వామి ఆలయంలో కంప్యూటర్ సిస్టమ్, సర్వర్ డేటాబేస్ హ్యాక్

Tapeswaram: తాపేశ్వరం లడ్డూల తయారీకి పూర్వ వైభవం.. గణేష్ పండల్ నుంచి ఆర్డర్లు

TTD: మోసాలకు అడ్డుకట్ట: భక్తుల కోసం తిరుమలలో ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ ల్యాబ్‌

తర్వాతి కథనం
Show comments