Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేత భూతమైన శిరిడీ సాయిని పూజించడం మానెయ్యాలి... స్వరూపానంద సంచలనం

సమాజాన్ని సన్మార్గంలో పెట్టడానికి సనాతన దర్మమే ఆధారమని జగద్గురు స్వరూపానంద సరస్వతీ స్వామీజి అన్నారు. సద్బుద్ధి... మంచి పనులతో అది వస్తుందన్నారు. కానీ గో మాంసం తినండి హింసకు పాల్పడండి ఏమైనా చెయ్యండి కానీ మమ్మల్ని నమ్మండి మీ కష్టాలు పోతాయి అని చెబుతున్

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (12:54 IST)
సమాజాన్ని సన్మార్గంలో పెట్టడానికి సనాతన దర్మమే ఆధారమని జగద్గురు స్వరూపానంద సరస్వతీ స్వామీజి అన్నారు. సద్బుద్ధి... మంచి పనులతో అది వస్తుందన్నారు. కానీ గో మాంసం తినండి హింసకు పాల్పడండి ఏమైనా చెయ్యండి కానీ మమ్మల్ని నమ్మండి మీ కష్టాలు పోతాయి అని చెబుతున్నారు. అలాంటి వారిని నమ్మవద్దు అని హితవు పలికారు.
 
సాయి బాబా పేరును, సాయి రామ్ చేసారు, పరమ పవిత్ర గాయత్రీ మంత్రాన్ని మార్చి అపచారం చేసారు. హనుమాన్ చాలీసా లాగా సాయి చాలీసా అంటున్నారు. ఇవన్నీ సనాతన ధర్మానికి విరుద్ధమని మండిపడ్డారు. సాయి లాంటి వారి చమత్కారాలు వట్టి మోసాలని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ నుండి కోట్లాదిమంది షిరిడీ వెళుతున్నారు. ఇది ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
సాయి పుట్టినప్పుడు దేశం బ్రిటీష్ పాలనలో ఉంది. ఆయన అంత గొప్పవాడైతే స్వాతంత్ర్యం ఎందుకు తేలేదని ప్రశ్నించారు. పాప భీతి పోయినందు వలన మహిళలపై, బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. రామాయణ,  భారతాలు తెలుసుకుంటే ఇలాంటివి జరగవన్నారు. మద్యం, డ్రగ్స్ ఏరులై పారడమే ఇలాంటి అనర్ధాలకు మరో కారణమని హెచ్చరించారు. భారత యువతను నాశనం చెయ్యడానికి పాకిస్థాన్ డ్రగ్స్‌ను అస్త్రంగా మలుచుకుంటుందని అన్నారు. దీనికి పంజాబ్ ఎక్కువగా నష్టపోయిందని తెలిపారు. మగవారితో పోటిగా ఆడవారు చెడు అలవాట్లను, మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారని అన్నారు. 
 
మన దేశ ప్రధాని మోదీ ఎన్నికల ముందు గో మాంసాన్ని నిషేధిస్తామని చెబితే ఆనందపడ్డామని అన్నారు. ఆ రోజుల కోసం ఎదురు చూసాం కానీ అది ఈ రోజుకు జరగడంలేదన్నారు. గో హత్యలకు భారత్ వేధికగా మారిపోతుందన్నారు. మన దేశంలో సుదర్శన చక్రాన్ని స్థాపించి పూజిస్తే ఉగ్రవాద ముప్పు తొలగుతుందని అన్నారు. షిరిడీలో సుదర్శన చక్రంతో కూడిన ఆలయాన్ని స్థాపిస్తామని అన్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments