Webdunia - Bharat's app for daily news and videos

Install App

18న కేరళలోని కుట్టిపురంలో శ్రీనివాస కళ్యాణం

Webdunia
మంగళవారం, 17 మే 2016 (15:44 IST)
భగవద్‌ రామానుజుల వారి సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా 106 దివ్యదేశాల పర్యటనలో ఉన్న సంచార రథం మే 18న ఉదయం 6.30 గంటలకు కేరళ రాష్ట్రంలోని నిలంబూరు నుంచి సంచార రథం బయలుదేరి 8.30 గంటలకు పట్టాంబికి చేరుకుంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. అక్కడ సమీపంలోని తిరువితువక్కోడులో గల శ్రీఉయ్యావంత పెరుమాళ్‌ ఆలయాన్ని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 11.30గంటలకు కుట్టిపురానికి రథం చేరుకుని తిరునావాయ్‌లో గల శ్రీ నావాయ్‌ ముగుంద పెరుమాళ్‌ ఆలయాన్ని దర్శిస్తారు. కుట్టిపురంలో సాయంత్రం శ్రీనివాస కళ్యాణం కూడా నిర్వహించనున్నారు. 
 
ఈ సంచార రథంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవమూర్తులు, శ్రీ రామానుజుల వారి విగ్రహం ఉన్నాయి. రథం ఊరేగింపులో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామి, అమ్మవార్లతో పాటు శ్రీరామానుజుల వారిని దర్శించుకుంటున్నారని తితిదే తెలిపింది. మే 19న తిరికక్కర, మే 20న తిరువల్ల, మే 22వ తేదీన తిరువనంతపురంలో శ్రీనివాస కళ్యాణాలు నిర్వహించనున్నారు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే యువకుడితో తల్లీ కుమార్తె అక్రమ సంబంధం - అతనితో కలిసి భర్త హత్య!!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రీ షెడ్యూల్- ఫిబ్రవరి 4న ప్రారంభం

Kolkata: గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఆర్జీ కాలేజీ వైద్య విద్యార్థిని.. కారణం?

ఎన్ఎక్స్ ప్లోరర్స్ కార్నివాల్‌లో శాస్త్రీయ నైపుణ్యాన్ని ప్రదర్శించిన గ్రామీణ విద్యార్థులు

మాయమాటలు చెప్పి భర్త కిడ్నీ అప్పగించింది... ఆ డబ్బుతో ప్రియుడితో భార్య పరారీ!!

అన్నీ చూడండి

లేటెస్ట్

01-02-2025 శనివారం దినఫలితాలు : జూదాలు, బెట్టింగుల జోలికి పోవద్దు...

01-02-2025 నుంచి 28-02-2025 వరకు మాస ఫలితాలు

Meher Baba: మెహెర్ బాబా ఎవరు? ఆయనెలా ఆధ్యాత్మిక గురువుగా మారారు?

31-01-2025 శుక్రవారం దినఫలితాలు : అపరిచితులతో జాగ్రత్త...

Vasantha panchami వసంత పంచమి ఫిబ్రవరి 2, పూజ ఎప్పుడు?

తర్వాతి కథనం
Show comments