Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే 28 నుంచి కార్వేటినగరం వేణుగోపాల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

Webdunia
గురువారం, 12 మే 2016 (18:38 IST)
తితిదే ఆధ్వర్యంలో నడుపబడుతున్న ఆలయాల్లో ఈనెల, జూన్‌ నెలల్లో వరుసగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. కార్వేటినగరంలోని శ్రీరుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలు మే 28వ తేదీ నుంచి జూన్‌ 5వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. 
 
మే 27వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 28వ తేదీ మిథున లగ్నంలో ధ్వజారోహణం, సాయంత్రం పెద్దశేషవాహనం, 29వ తేదీ చిన్నశేషవాహనం, హంసవాహనం, 30వ తేదీ సింహవాహనం, ముత్యపు పందిరి వాహనం, 31వ తేదీ కల్పవృక్షవాహనం, సర్వభూపాల వాహనం, 1వ తేదీ మోహినీ అవతారం, గరుడవాహనం, 2వ తేదీ హనుమంతవాహనం, గజవాహనం, 3వ తేదీ సూర్యప్రభవాహనం, చంద్రప్రభవాహనం, 4వ తేదీ రథోత్సవం, అశ్వవాహనం, 5వ తేదీ చక్రస్నానంలు జరుగనున్నాయి. 
 
మే 31వ తేదీ సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 వరకు స్వామివారి కళ్యాణోత్సవంను తితిదే నిర్వహించనుంది. కళ్యాణోత్సవంలో పాల్గొనే వారికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పంను బహుమానంగా తితిదే అందించనుంది. ఈ సందర్భంగగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాస సాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్మాత్మిక, భక్తి, సంగీత, సాంస్కృఇక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సంతోషంగా సాయంత్రాన్ని ఎంజాయ్ చేస్తున్న కుక్కపిల్ల-బాతుపిల్ల (video)

మీ అమ్మాయిని ప్రేమించా, నాకిచ్చేయండి: నీకింకా పెళ్లీడు రాలేదన్న బాలిక తండ్రిని పొడిచిన బాలుడు

Roja: జగనన్నతో భేటీ అయిన ఆర్కే రోజా.. ఎందుకో తెలుసా?

11 మంది సభకు వచ్చింది.. 11 నిమిషాల కోసమా? షర్మిల ప్రశ్న

మహా శివరాత్రి, వారంపదిరోజులు స్నానం చేయనివాళ్లు పూలు అమ్ముతారు: రాజాసింగ్ (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

22-02-2025 రాశి ఫలితాలు: ఖర్చులు అంచనాలను మించుతాయి

21-02-2025 రాశి ఫలితాలు, ఈ రాశివారు ఇతరుల కోసం విపరీత ఖర్చు

అనూరాధా నక్షత్రం రోజున శ్రీలక్ష్మీ పూజ.. బిల్వపత్రాలు.. ఉసిరికాయ.. శుక్రహోర మరిచిపోవద్దు..

Kalashtami February 2025: ఆవనూనెతో కాలభైరవునికి దీపం.. నలుపు శునకానికి ఇవి ఇస్తే?

20-02-2025 గురువారం దినఫలితాలు- ఆలోచనలు నిలకడగా ఉండవు

తర్వాతి కథనం
Show comments