Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభకార్యాల్లో ఆహారాన్ని ఎలా వడ్డించాలి.? ఉప్పును ఎప్పుడు..?

Webdunia
గురువారం, 20 నవంబరు 2014 (18:33 IST)
శుభకార్యాలలో విందు భోజనానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. భోజనాలు బాగా వున్నాయని బంధుమిత్రులు అంటే ఇక ఆ శుభాకార్యాన్ని సంపూర్ణత చేకూరినట్లు భావిస్తారు. ఇక ఈ శుభకార్యాల్లో భోజనాలు వడ్డించే కార్యక్రమం ఎంతో సందడిగా కనిపిస్తుంటుంది. ఒక్కొక్కరు ఒక్కో పదార్థాన్ని విస్తళ్లలో వడ్డిస్తూ వెళుతుంటారు. 
 
ముందుగా పప్పు ... చివర్లో మజ్జిగ అనే సూత్రం పైనే ఈ వడ్డన కొనసాగుతుంటుంది. అయితే మన పూర్వీకులు వడ్డన విషయంలో పద్ధతిని పాటిస్తూ వచ్చారు. ఆ పద్ధతిని పరిశీలిస్తే ... ఆహార పదార్థాలను వడ్డించడానికి వాళ్లు అరిటాకు శ్రేష్టమైనదిగా భావించారు.
 
అరిటాకులో ముందుగా కూరలను వడ్డించిన తరువాత మధ్య భాగంలో అన్నాన్ని వడ్డించాలి. ముందే ఉత్త అన్నాన్ని వడ్డించడాన్ని శాస్త్రం తప్పు పడుతుంది. ఇక పప్పు ... పాయసాలను అరిటాకు కుడి వైపున, పిండి పదార్థాలను ఎడమవైపున వడ్డించాలి. 
 
అతిథులు భోజనానికి కూర్చున్నప్పుడు వాళ్లు తినడం ప్రారంభించక ముందే నెయ్యి వడ్డించాలి ... తినడం ఆరంభించాక ఉప్పును వడ్డించాలి.
 
ఇక ఉప్పును అడిగి వడ్డించ కూడదనీ, ఒకవేళ వడ్డించడం మరిచిపోయినా అడగకూడదని అంటూ వుంటారు. ఆచారాన్ని గౌరవిస్తూ ... ఈ విధమైన పద్ధతులను పాటిస్తూ జరిపిన వడ్డన వల్లనే ఫలితం దక్కుతుందని పండితులు అంటున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments