శ్రీవారి లడ్డూల తయారీలో మళ్లీ నందిని నెయ్యి.. టీటీడీ

సెల్వి
శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (19:55 IST)
కలియుగ వైకుంఠం, శ్రీవారి లడ్డూల తయారీలో నందిని నెయ్యి వాడకాన్ని నిలిపివేయాలని గత ఏడాది ఆగస్టులో టిటిడి బోర్డు అనూహ్య నిర్ణయం తీసుకుంది. కొన్నేళ్లుగా వాడిన నందిని నెయ్యిని టీటీడీ ఆపి వేసింది. దీంతో తిరుమల లడ్డూల నాణ్యత, రుచిపై కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. 
 
ఈ వ్యవహారంలో ఏపీ మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకున్నారు. ప్రస్తుతం లడ్డూల తయారీకి సంబంధించి టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తయారీ ప్రయోజనాల కోసం నందిని నెయ్యిని తిరిగి తీసుకురావాలని బోర్డు నిర్ణయించింది. 
 
నాణ్యమైన ఉత్పత్తులకు పేరుగాంచిన కర్ణాటకకు చెందిన నందిని డైరీ సంస్థ నుంచి ఈ నాణ్యమైన నెయ్యి కొనుగోలు చేయనున్నారు. తిరుమల లడ్డూలలో రుచి, నాణ్యత కోసం నందిని నెయ్యిని తిరిగి తీసుకురావాలనే నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. అయితే లడ్డూల ధరలో ఎలాంటి మార్పు వుండదని తితిదే వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి పేరుతో నమ్మంచి వాడుకుని వదిలేశాడు.. భరించలేక ప్రాణాలు తీసుకున్న యువతి

యువతిని తాకరాని చోట తాకిన అకతాయి.. దేహశుద్ధి చేసిన ప్రజలు

మటన్ కూరలో కారం ఎక్కువైందంటూ తిట్టిన భర్త... మనస్తాపంతో నవ వధువు

చిత్తూరు నుంచి చెన్నై - బెంగుళూరుకు జస్ట్ ఓ గంటన్నర మాత్రమే జర్నీ....

అక్రమ సంబంధమే యమపాశమైంది... హత్య కేసులోని మిస్టరీని ఛేదించింది...

అన్నీ చూడండి

లేటెస్ట్

03-10-2025 శుక్రవారం దిన ఫలితాలు- మొండి బాకీలు వసూలవుతాయి

02-10-2025 గురువారం దిన ఫలితాలు - దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది...

కరుగుతున్న లోహంతో దాహం తీర్చుకున్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

Vijayadashami: దశమి పూజ ఎప్పుడు చేయాలి.. ఆయుధ పూజకు విజయ ముహూర్తం ఎప్పుడు?

01-10-2025 బుధవారం ఫలితాలు - ఫోన్ సందేశాలను నమ్మవద్దు...

తర్వాతి కథనం
Show comments