Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూలోక వైకుంఠాన్ని తలపించేలా పద్మావతి పరిణయోత్సవం

Webdunia
మంగళవారం, 17 మే 2016 (12:25 IST)
తిరుమలలో పద్మావతి పరిణయోత్సవం కన్నుల పండువగా కొనసాగుతోంది. రెండa రోజు కూడా నారాయణగిరి ఉద్యానవనంలో ఎంతో వైభవంగా స్వామి, అమ్మవార్ల పరిణయోత్సవాన్ని తితిదే వేదపండితులు నిర్వహించారు. భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో స్వర్ణకాంతులు విరజిమ్ముతున్న స్వర్ణిమ మండపంలో ఉత్సవాలను తితిదే అట్టహాసంగా నిర్వహిస్తోంది. 
 
పరిణయోత్సవల్లో భాగంగా రెండో రోజు పెండ్లి మండపంలో నిత్య నూతన వధూవరులైన శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలదండలు మార్చుకోవడం, పూల బంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి. పూలబంతులాట్లో తితిదే ఈఓ దంపతులు పాల్గొన్నారు. ఆస్థానాన్ని నిర్వహించారు. 
 
శ్రీవారికి వేదాలు, పురాణాలు, సంగీతరాగాలు, కవితలు, నృత్యాలను నివేదించారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీనివాసుడు బంగారు పల్లకినెక్కి అశేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో రెండోరోజు ఉత్సవం ముగిసింది. పరిణయోత్సవంలో పాల్గొన్న భక్తులకు వస్త్ర బహుమానం, ప్రసాద వితరణను తితిదే అందజేసింది. ఈ పరిణయోత్సవ వేడుకలు బుధవారంతో ముగియనున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు డ్రైవ్ చేస్తూ అనంతలోకాలకు చేరుకున్న ఎస్ఐ

Biryani-Chicken Fry కేరళ అంగన్‌వాడీల్లో ఉప్మా వద్దు... బిర్యానీ, చికెన్ ఫ్రై ఇస్తే బాగుండు.. బాలుడి వీడియో వైరల్ (video)

టెన్త్ క్లాస్ స్టూడెంట్స్‌కి స్నాక్స్.. సాయంత్రం 6 రకాలు.. రోజుకో రకం

బైక్ దొంగతనాలు.. ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు..టెస్ట్ రైడ్ ముసుగులో..?

ఏపీలో రూపురేఖలు మారిపోనున్న రైల్వే స్టేషన్లు..

అన్నీ చూడండి

లేటెస్ట్

వసంత పంచమి 2025.. విద్యార్థులే కాదు.. అందరూ పూజించవచ్చు.. ఈ రాశులకు?

02-02-2025 నుంచి 08-02-2025 వరకు వార ఫలితాలు

01-02-2025 శనివారం దినఫలితాలు : జూదాలు, బెట్టింగుల జోలికి పోవద్దు...

01-02-2025 నుంచి 28-02-2025 వరకు మాస ఫలితాలు

Meher Baba: మెహెర్ బాబా ఎవరు? ఆయనెలా ఆధ్యాత్మిక గురువుగా మారారు?

తర్వాతి కథనం
Show comments