Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో కాలినడక భక్తులకు దివ్యదర్శనం లేదు.. ఎందుకు?

తిరుమల తిరుపతి దేవస్థానం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కాలినడకన వెళ్లే భక్తులకు దివ్యదర్శనం రద్దు చేయనున్నట్లు తెలిపింది టీటీడీ. లెక్కకు మించి భక్తులు ఈ మార్గాల్లో వస్తున్నందున దాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. సాధారణంగా తిరుమలేశుడిని దర

Webdunia
బుధవారం, 28 జూన్ 2017 (12:40 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కాలినడకన వెళ్లే భక్తులకు దివ్యదర్శనం రద్దు చేయనున్నట్లు తెలిపింది టీటీడీ. లెక్కకు మించి భక్తులు ఈ మార్గాల్లో వస్తున్నందున దాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. సాధారణంగా తిరుమలేశుడిని దర్శించుకునే భక్తులకు 10 నుంచి 18 గంటల సమయం పట్టే వేళ, దివ్యదర్శనంలో మాత్రం 2 నుంచి 6 గంటల వ్యవధిలోనే దర్శనం ముగించుకుని బయటకు వస్తారు. 
 
దీంతో దివ్యదర్శనానికి డిమాండ్ గణనీయంగా పెరుగుతుండగా, అలిపిరి, శ్రీవారి నడక మార్గాల్లో తిరుమలకు చేరుకుంటున్న భక్తుల సంఖ్య వేలల్లోకి చేరుకుంది. ముఖ్యంగా వారాంతాల్లో నడిచి వచ్చే వారి సంఖ్య 35 వేల వరకూ ఉంటుండటంతో దివ్యదర్శనం టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు టీటీడీ నిర్ణయించింది. 
 
అయితే తొలి దశలో శుక్ర, శని, ఆది వారాల్లో మాత్రమే టోకెన్ల జారీని నిలుపుతున్నామని జేఈఓ శ్రీనివాసరాజు వెల్లడించారు. జూలై 7 నుంచి ఈ నిర్ణయం అమలవుతుందని, నడక మార్గాల్లో స్థాయికి మించి భక్తులు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పట్లేదని తెలిపారు. టిటిడి తీరుపై సామాన్య భక్తులు మండిపడుతున్నారు. మొక్కు ఉంటేనే కాలినడక వెళతాము తప్ప.. మామూలుగా వెళ్ళమంటున్నారు. టిటిడి ఉన్నతాధికారులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటున్నారు సామాన్య భక్తులు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం - వార్ ఫ్లైట్‌ను తరలిస్తున్న పాకిస్థాన్!!

పహల్గామ్‌ అటాక్: ప్రధాన సూత్రధారి సైఫుల్లా సాజిద్ జట్?

పహల్గామ్ ఉగ్రదాడి : నెల్లూరు జిల్లా కావలి వాసి మృతి

ఏప్రిల్ 28న గుంటూరు మేయర్ ఎన్నికలు

AP SSC Exam Results: ఏపీ పదవ తరగతి పరీక్షా ఫలితాలు.. బాలికలదే పైచేయి

అన్నీ చూడండి

లేటెస్ట్

అన్యమత ప్రచారం- మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్‌‌‌పై బదిలీ వేటు- టీటీడీ

19-04-2025 రాశి ఫలితాలు : వేడుకల్లో అత్యుత్సాహం తగదు...

18-04-2025 శుక్రవారం ఫలితాలు : పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు...

గుడ్ ఫ్రైడే: మానవాళికి శాశ్వతమైన మోక్షాన్నిచ్చిన జీసస్

12 సంవత్సరాల తర్వాత ఏర్పడే గజ లక్ష్మీ రాజయోగం- ఆ 3 రాశులు వారు పట్టిందల్లా?

తర్వాతి కథనం
Show comments