Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. 43 రోజుల్లో స్వామి సేవలో 35 లక్షల మంది

Webdunia
సోమవారం, 13 జూన్ 2016 (10:23 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం మరో కొత్త రికార్డును నమోదు చేసింది. అది కూడా అధిక సంఖ్యలో భక్తులకు దర్శనం చేయించి. గతంలో వేసవి కాలంలో ఎప్పుడూ లేనివిధంగా అనూహ్యంగా వచ్చిన భక్తులకు త్వరితగతిన దర్శన భాగ్యం కల్పించింది. మే 1వ తేదీ నుంచి ఆదివారం వరకు 43 రోజుల్లో 35 లక్షల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 
 
సాధారణంగా భక్తుల రద్దీ పెరిగితే ఆందోళనలు, తితిదే ఉన్నతాధికారులపై శాపనార్థాలు ఉంటాయి. అయితే ఈసారి మాత్రం పెద్దగా ఎక్కడ కూడా ఇలాంటివి కనిపించలేదు. కారణం వచ్చిన భక్తులను కంపార్టుమెంట్ల నుంచి అలాగే క్యూలైన్లలోకి వదలడం. దీని కారణంగా త్వరితగతిన భక్తులు దర్శనం చేసుకోగలిగారు. 
 
తితిదే ఈఓ సాంబశివరావుతో పాటు జెఈఓ శ్రీనివాసరాజుల పర్యవేక్షణే ఇందుకు కారణమని చెప్పుకోవచ్చు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చిన సమయంలో వెంటనే వీఐపీ దర్శనాలను రద్దు చేయడమో, తగ్గించడమో చేయడం వల్ల సామాన్యభక్తులు అధికసంఖ్యలో స్వామివారిని దర్శించుకోగలిగారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్, ఎందుకో తెలుసా? (video)

Telugu Compulsory: తెలుగు తప్పనిసరి- తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఐటీ నగరం బెంగుళూరులో రెడ్ అలెర్ట్ ... ఎందుకో తెలుసా?

Nara Lokesh: దళితులకు గుండు కొట్టించి, వారిని చంపి డోర్ డెలివరీలు చేసిన వారు మీరే! (video)

ఉపాధ్యాయురాలి హత్యకు విద్యార్థుల కుట్ర... ఎందుకు.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

Maha Shivratri 2025: తెల్లని పువ్వులతో పూజ.. అప్పులు మటాష్

రాత్రి నిద్రించే ముందు మహిళలు ఇలా చేస్తున్నారా? బెడ్‌రూమ్‌లో?

24-02-2025 సోమవారం దినఫలితాలు - ఇతరుల విషయాల్లో జోక్యం తగదు...

23-02-2025 నుంచి 01-03-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

23-02-2025 ఆదివారం దినఫలితాలు - మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు...

తర్వాతి కథనం
Show comments