Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యప్ప భక్తులకు శుభవార్త.. శబరిమల సన్నిధికి 48 కి.మీ దూరంలో ఎయిర్‌పోర్ట్

అయ్యప్ప భక్తులకు శుభవార్త. కేరళ సర్కారు అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం అయ్యప్ప సన్నిధికి 48 కిలోమీటర్ల దూరంలో ఎయిర్ పోర్టును ఏర్పాటు చేయనుంది. నవంబర్ నుంచి జనవరి మధ్య శబరిమలకు కోట్లాది మంది భక్తులు చేరుకు

Webdunia
గురువారం, 20 జులై 2017 (11:46 IST)
అయ్యప్ప భక్తులకు శుభవార్త. కేరళ సర్కారు అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం అయ్యప్ప సన్నిధికి 48 కిలోమీటర్ల దూరంలో ఎయిర్ పోర్టును ఏర్పాటు చేయనుంది. నవంబర్ నుంచి జనవరి మధ్య శబరిమలకు కోట్లాది మంది భక్తులు వస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో కొట్టాయం జిల్లా కంజిరపల్లి తాలూకాలోని చెరువల్లీ ఎస్టేట్‌లో 2,263 ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టును నిర్మించేందుకు కేరళ సర్కారు శ్రీకారంచుట్టింది. ఇక ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే, శబరిమల ప్రయాణం మరింత సులువు కానుంది.  
 
ఈ ప్రాంతం రెండు జాతీయ రహదారులకు దగ్గరగా ఉండటంతో పాటు పీడబ్ల్యూడీ రోడ్డుకు దగ్గరగా ఉన్న కారణంగా ఇక్కడ ఎయిర్ పోర్టు నిర్మించాలని కేరళ సర్కారు భావిస్తోంది. ఈ ప్రాంతంలో ఎయిర్‌పోర్టును నిర్మించడం ద్వారా భక్తులు శబరిమలకు మరింత సులువుగా చేరుకునే అవకాశాలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. ఇందులో భాగంగా  బుధవారం జరిగిన కేరళ మంత్రివర్గ సమావేశం విమానాశ్రయం నిర్మాణానికి ఆమోదం పలికింది. 
 
కాగా, ఈ సంవత్సరం ఫిబ్రవరిలోనే శబరిమలకు సమీపంలో ఎక్కడ విమానాశ్రయం నిర్మించవచ్చన్న విషయాన్ని నిర్థారించాలని ప్రభుత్వం నిర్ణయించి, మూడు ప్రాంతాలను గుర్తించింది. చివరకు చెరువల్లి ఎస్టేట్‌ను ఎంపిక చేసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

అన్నీ చూడండి

లేటెస్ట్

హనుమజ్జయంతి ఎప్పుడు.. పూజ ఎలా చేయాలి?

11-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : ఆశలు ఒదిలేసుకున్న ధనం?

11 శుక్రవారాలు ఇలా శ్రీ మహాలక్ష్మీ పూజ చేస్తే.. ఉత్తర ఫాల్గుణి రోజున?

10-04-2025 గురువారం మీ రాశిఫలాలు : ఇంటిని అలా వదిలి వెళ్లకండి

ఇంట్లో శివలింగాన్ని పూజించవచ్చా? బొటనవేలు కంటే పొడవు వుండకూడదు

తర్వాతి కథనం
Show comments