Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో క్రిష్ణాష్టమి వేడుకలు

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (17:04 IST)
తిరుపతిలోని టిటిడి గోశాలో శాస్త్రోక్తంగా గోకులాష్టమి గోపూజ కార్యక్రమం నిర్వహించారు. టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ కె.ఎస్.జవహర్ రెడ్డిలు గోశాలలోని వేణుగోపాలస్వామి వారిని దర్సించుకున్నారు. 
 
అనంతరం గోమాత, దూడకు అర్చకుల మంత్రాల నడుమ నూతన వస్త్రాలు, పూలమాలలు వేసి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. అనంతరం గోమాత, దూడకు ప్రదక్షిణలు చేసి హారతి ఇచ్చారు. గోమాత పాలు పితికి వాటిని తీసుకుని వెళ్ళి అర్చకులకు అందించి అభిషేకం చేయించారు.
 
అలాగే శ్రీ వేంకటేశ్వర మహామంత్ర పుస్తక జపసమర్పణ చేస్తూ ఆలయాన్ని సందర్సించి అక్కడ పుస్తకంలో ఓం నమో వేంకటేశాయ అని రాశారు. తిరుపతిలోనే కాదు తిరుమలలోను గోకులాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి.
 
తిరుమలలోని గోగర్భం డ్యాం చెంత ఉన్న ఉద్యావనంలో కాళీయమర్ధనుడు అయిన చిన్నిక్రిష్ణునికి ప్రత్యేక పూజలు జరిపారు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, కుంకుమ, చందనం, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

కూలిన హెలికాఫ్టర్.. ఇరాన్ అధ్యక్షుడు మృతి?

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవుతారని తెలంగాణాలో సంబరాలు.. వీడియో వైరల్

ఎన్నికల్లో గాజువాక టీడీపీ అభ్యర్థికి ప్రచారం చేసిన భార్య.. సస్పెండ్ చేసిన రిజిస్ట్రార్

దేశంలో ప్రారంభమైన ఐదో విడత పోలింగ్ - ఓటేసిన ప్రముఖులు

నా భార్య కొడుతుంది.. చంపేస్తుందేమో.. నా భార్య నుండి నన్ను కాపాడండి

రాగి ఆభరణాలు ధరిస్తే.. సూర్య గ్రహ, వాస్తు దోషాలు పరార్

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

తర్వాతి కథనం
Show comments