Webdunia - Bharat's app for daily news and videos

Install App

షిర్డీ సాయిబాబాకు రూ.28లక్షల బంగారు కిరీటం.. ఇటలీ మహిళ కానుక

ఇటలీ దేశానికి చెందిన ఓ మహిళ రూ.28లక్షల విలువైన బంగారు కిరీటాన్ని షిర్డీ సాయిబాబాకు బహూకరించారు. శీలిని డోలోరాస్ అలియాస్ సాయి దుర్గా అనే 72 ఏళ్ల ఇటాలియన్ మహిళా భక్తురాలు 855 గ్రాముల బరువు ఉన్న రత్నాలు

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (12:01 IST)
ఇటలీ దేశానికి చెందిన ఓ మహిళ రూ.28లక్షల విలువైన బంగారు కిరీటాన్ని షిర్డీ సాయిబాబాకు బహూకరించారు. శీలిని డోలోరాస్ అలియాస్ సాయి దుర్గా అనే 72 ఏళ్ల ఇటాలియన్ మహిళా భక్తురాలు 855 గ్రాముల బరువు ఉన్న రత్నాలు పొదిగిన బంగారు కిరీటాన్ని సాయిబాబా సంస్థాన్ ట్రస్టుకు బహూకరించారు.  సాయిబాబా భక్తురాలైన ఈమె.. గత తొమ్మిదేళ్లుగా ప్రతి నెలా షిర్డీని సందర్శించుకుంటున్నారు. 
 
గతంలో సాయి దుర్గా బంగారంతో తయారు చేసిన రుద్రాక్ష మాలను రూ.25లక్షలతో చేయించి దేవుడికి సమర్పించుకున్నారు. తాజాగా రూ.28లక్షల విలువైన కిరీటాన్ని స్వామివారికి కానుకగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇటలీ దేశంలో సాయిబాబా దేవాలయాన్ని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. తమ దేశంలో నిర్మిస్తున్న దేవాలయంలో ప్రతిష్ఠించేందుకు సిద్ధం చేసిన సాయి ప్రతిమను షిర్డీ సాయి సన్నిధిలో పెట్టి ఆయన ఆశీస్సులు తీసుకున్నానని ఇటలీలోని సాయి భక్తురాలు వివరించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గుర్రంపై ఊరేగింపు: దళిత వరుడిపై దాడి చేసిన ఉన్నత కుల వర్గం.. ఎక్కడో తెలుసా?

Sunstroke: కరీంనగర్‌లో వడగాలులు - ఏడుగురు మృతి

నేను ఇండియన్, నా భర్త పాకిస్తానీ, నన్ను పాక్ రానివ్వడంలేదు: మహిళ ఆవేదన (video)

Ranganna: వైఎస్ వివేకానంద రెడ్డి కేసు.. రంగన్న భార్య సుశీలమ్మకు సిట్ నోటీసులు

Pahalgam: ఎల్ఓసి వద్ద ఉద్రిక్తత.. భూగర్భ బంకర్లను శుభ్రం చేస్తున్నారు..

అన్నీ చూడండి

లేటెస్ట్

Varuthini Ekadashi 2025: వామనుడికి ఇలా చేస్తే.. కుంకుమ పువ్వు పాలతో..?

24-04-2015 గురువారం ఫలితాలు - ఆప్తులతో సంభాషిస్తారు...

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ నాడు ఈ రాశుల్లో అరుదైన యోగాలు.. తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

23-04-2025 బుధవారం ఫలితాలు - కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి...

మంగళవారం కుమార స్వామి పూజతో కలిగే ఫలితం ఏంటి?

తర్వాతి కథనం
Show comments