Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 రోజుల్లో 2.5 లక్షల మంది భక్తులకి శ్రీవారి దర్శనం.. రూ.3.85 కోట్ల ఆదాయం

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2015 (09:16 IST)
గత మూడు రోజుల్లో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 2.5 లక్షలుగా ఉంది. వారాంతపు సెలవులతో పాటు తమిళ పవిత్ర పెరటాసి మాసం కావడంతో తిరుమల కొండపై అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమైన రద్దీ శని, ఆదివారాల్లో పూర్తి స్థాయిలో ఉండగా, ఆదివారం సాయంత్రం నుంచి తగ్గుతూ వచ్చింది. ఆదివారం ఒక్కరోజే స్వామివారిని 87,101 మంది భక్తులు దర్శించుకోగా, మూడు రోజుల్లో 2.5 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నట్టు తితిదే ఆలయ అధికారులు వెల్లడించారు. 
 
మరోవైపు శ్రీవారి హుండీ ఆదాయం అత్యధికంగా రూ.3.85 కోట్ల మేరకు వచ్చినట్టు వారు తెలిపారు. అదేసమయంలో వీఐపీ దర్శనం టిక్కెట్లపై కూడా తితిదే అదనపు లడ్డూలను జారీ చేయడం ఆదివారం ప్రారంభించింది. ఈ ప్రకారం టిక్కెట్టు కొనుగోలు సమయంలో గరిష్టంగా ఆరు లడ్డూలు పొందడానికి అవకాశం ఇచ్చింది.
 
ఇదిలావుండగా, సోమవారం ఉదయం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మూడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments