Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడి ప్రసాదాలపై కూడా జీఎస్టీ.. భారం భక్తుడిపైనే....

పండు, అది లేకుంటే ఓ పువ్వు, అదీ దొరక్కుంటే ఓ ఆకు సమర్పించినా దేవుడు ప్రసన్నమవుతాడని పురాణాలు చెపుతున్నమాట. కానీ ఇప్పుడు చేతి చమురు వదిలించుకుంటేనాగానీ దేవుడిని చూసేందుకు అనుమతించబోమని కేంద్రంలోని బీజే

Webdunia
గురువారం, 1 మార్చి 2018 (09:24 IST)
పండు, అది లేకుంటే ఓ పువ్వు, అదీ దొరక్కుంటే ఓ ఆకు సమర్పించినా దేవుడు ప్రసన్నమవుతాడని పురాణాలు చెపుతున్నమాట. కానీ ఇప్పుడు చేతి చమురు వదిలించుకుంటేనాగానీ దేవుడిని చూసేందుకు అనుమతించబోమని కేంద్రంలోని బీజేపీ పాలకులు తేల్చి చెప్పారు. ఫలితంగా కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు ప్రవేశపెట్టిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) పోటు దేవుడి ప్రసాదాలను కూడా తాకింది. దేశంలో నివసించే ప్రతి పౌరుడుపైనే కాదు.. భక్తుడిని కూడా వదిలిపెట్టేది లేదని బీజేపీ పాలకులు తేల్చి చెప్పారు. ఫలితంగా దేవుడి ప్రసాదాలపై కూడా ఈ భారం తప్పలేదు. అయితే, ఈ జీఎస్టీ భారాన్ని భక్తుడిపైనే వేయాలని ఆలయాల పాలక మండళ్లు నిర్ణయించాయి. 
 
అష్టోత్తరం చేయించినా, హారతి సమర్పించినా ఆర్జిత సేవల రూపంలో జీఎస్టీ కన్ను పడుతోంది. కల్యాణోత్సవాలు, వ్రతాలు, సువర్ణ పుష్పార్చనలు.. ఒకటేమిటి దేవాలయాల్లోని ఆర్జిత సేవలన్నింటిపై 18 శాతం మేర పన్ను చెల్లించాల్సి వస్తోంది. ప్రసాద సరుకులు కొన్నప్పుడు మళ్లీ 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి వస్తోంది. అంటే ఆ మేర ధరలు పెరిగిపోయాయి. 
 
ఇక రూ.1,000, అంతకంటే ఎక్కువ రుసుము ఉన్న కాటేజీలపైనా 12 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. దీంతో ఈ మొత్తాన్ని ఆ దేవాలయం ఆదాయంలోంచి చెల్లించాల్సి వస్తోంది. ఈ భారాన్ని భక్తులపైనే వేస్తామని ప్రభుత్వానికి నివేదించి, అనుమతి పొంది ధరలు పెంచేస్తున్నాయి. జీఎస్టీ భారంతో ఇప్పటికే యాదాద్రి, భద్రాచలంలో ప్రసాదాల ధరలు రూ.5 చొప్పున పెంచారు. మిగతా దేవాలయాల్లోనూ పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఆర్జిత సేవల ధరలూ పెంచాలని దేవాదాయ శాఖను దేవాలయాలు కోరాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

Z+ Security: జెడ్ ప్లస్ భద్రత ఇవ్వండి లేదా బుల్లెట్ ఫ్రూఫ్ కారునైనా వాడుకుంటా!

Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు

అన్నీ చూడండి

లేటెస్ట్

08-05-2025 గురువారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత ఉండదు...

07-05-2025 బుధవారం దినఫలితాలు - శ్రీమతి ధోరణి చికాకుపరుస్తుంది...

06-05-2025 మంగళవారం దినఫలితాలు - దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది...

Jogulamba: జోగులాంబ ఆలయం.. దక్షిణ కాశీ.. జీవకళ తగ్గితే.. అక్కడ బల్లుల సంఖ్య పెరిగితే?

05-05-2025 సోమవారం దినఫలితాలు-ఒత్తిడి పెరగకుండా చూసుకోండి

తర్వాతి కథనం
Show comments