తిరుమలకు క్యూకట్టిన భక్తులు ... ఎందుకు?

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (11:43 IST)
తిరుమలకు భక్తులు క్యూ కట్టారు. ఉచిత దర్శనాలకు సంబంధించిన టిక్కెట్లు ఇస్తున్నవార్త తెలియడంతో భక్తులు తిరుమలకు క్యూకట్టారు. ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనలను సడలించిన తర్వాత రోజుకు 6 వేల మంది భక్తులను దర్శనానికి అనుమతిస్తున్న విషయం తెల్సిందే. 
 
ఇపుడు దర్శనాల సంఖ్యను కూడా పెంచారు. రోజుకు మూడు వేల మందికి ఉచిత దర్శనం టోకెన్లను ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్న టీటీడీ, అలిపిరిలోని భూదేవీ కాంప్లెక్సులో ప్రత్యేక కౌంటరును ఏర్పాటుచేసింది. 
 
శుక్రవారం ఉదయం టికెట్లను జారీచేయనున్నామని ప్రకటన వెలువడగానే, భక్తులు పెద్ద సంఖ్యలో అలిపిరికి చేరుకున్నారు. భక్తులంతా భౌతికదూరం నిబంధనలు పాటించేలా చూసేందుకు అధికారులు తల పట్టుకోవాల్సి వచ్చింది. 
 
ఈ నెల 30 వరకూ టికెట్లను జారీ చేశామని, వచ్చే నెల 11 వరకూ ఆన్‌లైన్ కోటా టికెట్ల పూర్తయిందని, ఆపై టికెట్లను త్వరలోనే విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐబొమ్మ కేసు : పోలీస్ కస్టడీకి ఇమ్మడి.. కోర్టు అనుమతి

చిప్స్ ప్యాకెట్‌లోని చిన్న బొమ్మను మింగి నాలుగేళ్ల బాలుడు మృతి.. ఎక్కడ?

ఒరిగిపోయిన విద్యుత్ పోల్... టాటా నగర్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

రెండు నెలల క్రితం వివాహం జరిగింది.. నా భార్య 8 నెలల గర్భవతి ఎలా?

Jana Sena: జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం: జనసేన ప్రకటన

అన్నీ చూడండి

లేటెస్ట్

17-11-2025 సోమవారం ఫలితాలు - మీ శ్రమ, నమ్మకం ఫలిస్తాయి...

16-11-2025 ఆదివారం రాశి ఫలాలు - మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి...

16-11- 2025 నుంచి 22-11-2025 వరకు మీ వార రాశిఫలాలు

15-11-2025 శనివారం దినఫలాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?

తర్వాతి కథనం
Show comments