Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెజవాడ కనకదుర్గ ఆలయంలో శఠారి ఆశీర్వాదం నిలిపివేత, ఆర్జిత సేవలు కూడా..?

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (18:35 IST)
కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. రద్దీ ఉన్న ప్రాంతాల నుంచే ఈ కేసుల సంఖ్య ఎక్కువవడానికి కారణమవుతోంది. మాస్కులను ధరించకుండా నిర్లక్ష్యంగా ఉండటంతో పాటు శానిటైజర్లను వాడకపోవడంతో కరోనా బారిన చాలామంది పడుతున్నారు. దీంతో దేవదాయశాఖ అప్రమత్తమైంది. ఆలయాల వద్ద ఎప్పుడూ భక్తుల రద్దీ ఉంటుంది కాబట్టి కొన్ని ఆలయాల్లో నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయం తీసుకుంది.

 
ముఖ్యంగా ఇంద్రకీలాద్రిపై కరోనా ఆంక్షలను విధించారు. ఆలయంలోని దుర్గమ్మ అంతరాలయ దర్సనంతో పాటు శఠారిని పూర్తిగా నిలిపివేశారు. అన్ని ఆర్జిత సేవలకు 50 శాతం మాత్రమే భక్తులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు.

 
ఆలయంలో ఉచిత ప్రసాదాల పంపిణీ నిలుపుదల చేశారు. దుర్గమ్మ దర్సనానికి పరిమిత సంఖ్యలోనే భక్తులకు అవకాశం కల్పిస్తున్నారు. మాస్కులు లేని భక్తులకు అనుమతి లేదని స్పష్టం చేస్తున్నారు.

 
ఇంద్రకీలాద్రిపై తక్కువ మొత్తంలోనే ప్రసాద విక్రయాలు నిర్వహిస్తున్నారని ఈఓ భ్రమరాంభ స్పష్టం చేశారు. అంతే కాకుండా కోవిడ్ ఉదృతి నేపథ్యంలో నిబంధనలను కఠినతరం చేస్తున్నామని.. భక్తులు ఇందుకు సహకరించాలని కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ, రామగుండంలో భూకంపం సంభవిస్తుందా?

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

అన్నీ చూడండి

లేటెస్ట్

బుధవారం రోజున పూజ ఎలా చేయాలి? భార్యాభర్తలు కలిసి ఆచరిస్తే?

మీనరాశిలోకి మారుతున్న శుక్రుడు.. ఈ 3 రాశుల వారికి అంతా శుభమే

08-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : సంతానం చదువులపై దృష్టిపెడతారు...

ఇంట్లోకి నల్ల చీమలు వస్తున్నాయా.. ఇది మంచికేనా.. లేకుంటే?

07-04-2025 సోమవారం మీ రాశిఫలాలు : మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది...

తర్వాతి కథనం
Show comments