Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి దర్శనానికి మరో రెండు వారాలు బ్రేక్ : తితిదే

Webdunia
సోమవారం, 30 మార్చి 2020 (12:38 IST)
కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు పడరాని పాట్లు పడుతుంటారు. తమ జీవితకాలంలో ఆ కలియుగ వైకుంఠాన్ని ఒక్కసారైనా తనివితీరా చూడాలని ప్రతి ఒక్క భక్తుడూ పరితపిస్తుంటారు. అలాంటిది.. కరోనా వైరస్ మహమ్మారి పుణ్యమాని తిరుమల గిరులు గత పది రోజులుగా నిర్మానుష్యంగా మారిపోయాయి. దీనికి కారణం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతుండటంతో పాటు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేస్తూ తితిదే కీలక నిర్ణయం తీసుకుంది. 
 
దీంతో ఆలయంలోని మళ్లీ భక్తులను ఎపుడెపుడు అనుమతిస్తారా? అంటూ ప్రతి ఒక్క భక్తులు వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే, దేశంలో ఇంకా కరోనా వైరస్ భయం తొలగిపోలేదు. దీంతో లాక్‌డౌన్ అమలైనన్ని రోజులూ దర్శనాలను ఆపేయాలని టీటీడీ నిర్ణయించింది. అంటే ఏప్రిల్‌ 14 వరకూ భక్తులకు దర్శనాల రద్దు నిర్ణయం కొనసాగుతుందని టీడీడీ వెల్లడించింది. 
 
ఆలయ అవసరాలకు తిరిగే అత్యవసర వాహనాలకు మినహా, తిరుమలకు వెళ్లే రెండు ఘాట్‌ రోడ్లనూ మూసివేశామని తెలిపింది. స్వామివారికి చేయాల్సిన అన్ని సేవలూ ఆగమశాస్త్రోక్తంగా జరుగుతున్నాయని, తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవ నుంచి రాత్రి 8 గంటలకు ఏకాంత సేవ వరకూ అన్నీ శాస్త్రోక్తంగా జరుగుతున్నాయని తెలిపారు. అయితే, వచ్చే నెలలో జరగాల్సిన వార్షిక వసంతోత్సవాలపై మాత్రం ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

లేటెస్ట్

13-04-2025 నుంచి 19-04-2025 వరకు మీ వార ఫలితాలు

12-04-2025 శనివారం మీ రాశిఫలాలు : వివాదాలు సద్దుమణుగుతాయి...

ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవి వచ్చిన దారినే ఎందుకు వెళ్లిపోతుందో తెలుసా?

టీటీడీ గోశాలలో 100కి పైగా ఆవులు చనిపోయాయా? అవన్నీ అసత్యపు వార్తలు

హనుమజ్జయంతి ఎప్పుడు.. పూజ ఎలా చేయాలి?

తర్వాతి కథనం
Show comments