Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిదంబరం తిరుమలలో ఏం చేశారో తెలుసా...?!

చిదంబరం.. సాధారణంగా ఒక్కో రంగంలో ఒక్కో ప్రముఖుడు ఉంటాడు. ఈ చిదంబరం ఎవరో.. తిరుమల లాంటి పుణ్యక్షేత్రంలో ఏం చేశారో కన్ఫ్యూజన్‌గా ఉంది కదూ. అయితే దీన్ని చదవండి. కాంగ్రెస్‌ పార్టీ హయాంలో పార్టీకే పెద్ద దిక్కుగా ఉండి, కీలక ఆర్థిక శాఖామంత్రిగా ఉన్న చిదంబరం

Webdunia
మంగళవారం, 13 డిశెంబరు 2016 (20:34 IST)
చిదంబరం.. సాధారణంగా ఒక్కో రంగంలో ఒక్కో ప్రముఖుడు ఉంటాడు. ఈ చిదంబరం ఎవరో.. తిరుమల లాంటి పుణ్యక్షేత్రంలో ఏం చేశారో కన్ఫ్యూజన్‌గా ఉంది కదూ. అయితే దీన్ని చదవండి. కాంగ్రెస్‌ పార్టీ హయాంలో పార్టీకే పెద్ద దిక్కుగా ఉండి, కీలక ఆర్థిక శాఖామంత్రిగా ఉన్న చిదంబరం కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చారు. దేశంలో ఘోరంగా కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయిన చాలాకాలం తరువాత చిదంబరం తిరుమలకు రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
 
సాధారణ భక్తుడిలా వచ్చిన చిదంబరం ముందుగానే ఆన్‌లైన్‌లో టిక్కెట్లను కొనుగోలు చేశారు. సుపథం మార్గం నుంచి ఆలయంలోకి చేరుకున్న చిదంబరం కుటుంబ సభ్యులు మహాలఘు దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. సాధారణంగా మాజీ కేంద్రమంత్రికి తితిదే సపర్యలు చేసి ప్రత్యేక దర్శనభాగ్యం చేసే అవకాశం ఉంది. అయితే చిదంబరం ముబావంగా, ఎవరితో మాట్లాడకుండా ఎంత నిశ్శబ్దంగా వచ్చారో.. అదేవిధంగా తిరిగి వెళ్ళిపోయారు. చిదంబరంను చూసిన తితిదే అధికారులు ఆయన్ను ప్రత్యేకంగా తీసుకెళ్ళాలని చూసినా ఆయన వారిని సున్నితంగా తిరస్కరించారు. ఆలయం వెలుపల కూడా మీడియాతో మాట్లాడకుండానే చిదంబరం వెళ్ళిపోయారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments