Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 14 నుంచి శ్రీవారి ఆర్జిత సేవలు : తితిదే

Webdunia
సోమవారం, 29 మార్చి 2021 (07:30 IST)
తిరుమ‌ల తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో వచ్చే నెల 14వ తేదీ నుంచి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభంకానున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే, వచ్చే నెల 14వ తేదీ నుంచి ఈ సేవలను తిరిగి ప్రారంభించాలని తితిదే నిర్ణయించింది. ఇందులోభాగంగా, ఏప్రిల్ 14వ తేదీ నుంచి జరిగే ఆర్జిత సేవలకు భక్తులను కూడా అనుమతిస్తారు. ఈ మేరకు తితిదే ఓ ప్రకటన విడుదల చేసింది. 
 
ఆర్జిత సేవ‌లు/ఉత‌్స‌వాల్లో పాల్గొనే గృహ‌స్తులు కోవిడ్‌-19 నిబంధ‌న‌లు పాటించాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తోంది. గృహ‌స్తులు సేవ‌కు మూడు రోజులు ముందు ప‌రీక్ష చేయించుకుని కోవిడ్‌-19 నెగెటివ్ స‌ర్టిఫికేట్‌ను వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వ‌ద్ద త‌‌ప్ప‌నిస‌రిగా స‌మ‌ర్పించాల‌ని స్ప‌ష్టం చేసింది.
 
2020 మార్చి 20 నుండి 2021 ఏప్రిల్ 13వ తేదీ వ‌ర‌కు సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న‌, అష్ట‌ద‌ళ‌పాద‌ప‌ద్మారాధ‌న, స‌హ‌స్ర‌క‌ళ‌శాభిషేకం, తిరుప్పావ‌డ‌, మేల్‌చాట్ వ‌స్త్రం, పూరాభిషేకం, పునుగు పాత్ర‌, క‌స్తూరి పాత్ర‌, నిజ‌పాద‌ద‌ర్శ‌నం ఆర్జిత సేవా టికెట్ల‌ను బుక్ చేసుకున్న భ‌క్తులు వీటికి బ‌దులుగా బ్రేక్ ద‌ర్శ‌నం లేదా స‌ద‌రు టికెట్ మొత్తాన్ని రీఫండ్ పొందే స‌దుపాయాన్ని టిటిడి క‌ల్పించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

Sadhguru: ఉగ్రవాదులు కోరుకునేది యుద్ధం కాదు.. ఏదో తెలుసా? ఐక్యత ముఖ్యం: సద్గురు

Pahalgam: పహల్గామ్ ఘటన: పాక్ పౌరులు 48గంటల్లో భారత్‌ నుంచి వెళ్లిపోవాల్సిందే.. కేంద్రం (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

20-04-2025 నుంచి 26-04-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

అన్యమత ప్రచారం- మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్‌‌‌పై బదిలీ వేటు- టీటీడీ

19-04-2025 రాశి ఫలితాలు : వేడుకల్లో అత్యుత్సాహం తగదు...

18-04-2025 శుక్రవారం ఫలితాలు : పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు...

గుడ్ ఫ్రైడే: మానవాళికి శాశ్వతమైన మోక్షాన్నిచ్చిన జీసస్

తర్వాతి కథనం
Show comments