Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృత్యుకుహరానికి ద్వారం.. అంధ విశ్వాసం

Webdunia
WD PhotoWD
' ఏదినిజం' విభాగంలో, మన సమాజంలోని అనేక నమ్మకాలను మరియు మూఢ నమ్మకాలను మీకు పరిచయం చేసాము. కొన్నిసార్లు ఈ నమ్మకాలు మన విశ్వాసం రూపంలోను మరి కొన్నిసార్లు మన మూఢనమ్మకంగా రూపాంతరం చెందాయి. అటువంటి మూఢ నమ్మకాల వెనుక దాగి ఉన్న నిజాన్ని తేటతెల్లం చేయడమే ఈ కథ యొక్క ప్రధాన లక్ష్యం. మేథావులైన మా పాఠకులు విశ్వాసానికి మరియు మూఢనమ్మకానికి మధ్య ఉండే సన్నని గీతను గుర్తించి మూఢ నమ్మకాల వినాశకర చర్యల పట్ల జాగరూకులై ఉంటారని ఆకాంక్షిస్తున్నాము.

పదకొండు ప్రాణాలను బలితీసుకున్న హేయమైన, దారుణమైన మూఢనమ్మకాన్ని ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాము. అవును, మనం మాట్లాడుకుంటున్నది 'సరోత' (గోళ్ళను కత్తిరించేందుకు ఉపయోగించేది)గా పిలవబడే ఆయుధంతో రోగుల కంటివ్యాధులను నయం చేస్తానని నమ్మబలికే మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన 'సరోత బాబా' గురించి.

ప్రజలు తమ వ్యాధుల నివారణకు ఇక్కడకు వస్తుంటారు. తనదైన వ్యాధి నివారణ ప్రక్రియ ద్వారా ఈశ్వర్ సింగ్ రాజ్‌పుట్ కాస్తా 'సరోతవాలే బాబా' లేదా 'సర్జన ్
WD PhotoWD
బాబా'గా మారిపోయాడు. ఎయిడ్స్, క్యాన్సర్ తదితర వ్యాధులను నయం చేస్తానంటూ అతడు చేస్తున్న ప్రకటనలు అనేకమంది ఈ ప్రాంతం పట్ల ఆకర్షతులయ్యేందుకు కారణమవుతున్నాయి.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆయన వ్యాధిప్రక్రియ చాలా విన్నూత్నంగా ఉంటుంది. రోగి ముఖంపై దుప్పటిని కప్పిన అనంతరం రోగి కంట్లోకి 'సరోత'ను ఉంచడం ద్వారా అతడు వైద్యం చేస్తాడు. గతంలో వ్యాధికి చికిత్స పొందిన వారితో పోల్చుకుంటే ఎటువంటి చికిత్స పొందకుండా తన దగ్గరకు వచ్చేవారికి వ్యాధి త్వరగా నయమవుతుందని అతడు చెప్పుకుంటాడు.

WD PhotoWD
బుందేల్‌ఖండ్ మరియ ఛిటర్‌పూర్‌ వంటి వెనుకబడిన ప్రాంతాలలో అతని ప్రకటనలకు ఆయన మద్దతుదారులు చేస్తున్న ప్రచారం అనేక మంది ప్రజలను ఇక్కడకు రప్పిస్తున్నది. ఇప్పుడు, 'సరోత' సహాయంతో ముక్కలైన చెక్కముక్కలను అతడు పంపిణీ చేయడం ప్రారంభించాడు. ఈ ముక్కలు ప్రజలను అన్నిరకాల రోగాలకు దూరంగా ఉంచుతాయని అతడు నమ్మబలుకుతాడు.

గడచిన అనేక సంవత్సరాలుగా అతడు ఈ విధమైన వైద్యాన్ని చేస్తున్నాడు. ప్రతిరోజూ నాగదేవతలకు గంటన్నర పాటు పూజలు చేస్తానని అతడు చెప్పుకుంటాడు. పూజలో వినియోగించే నీటి పరిమాణం వ్యాధుల నివారణపై ప్రభావం చూపుతుందని అతడు పేర్కొంటాడు. వ్యాధి నివారణతో పాటు ఈ నీటిని స్వీకరించే నిమిత్తం ప్రతి గురువారం అనేక మంది ప్రజలు ఇక్కడకు వస్తుంటారు.

వేలకొలది ప్రజల రాకతో గ్రామంలో జనజీవనానికి అంతరాయం కలుగుతున్నందున గ్రామం విడిచి వెళ్ళవలసిందిగా గ్రామస్థులు అతడికి విజ్ఞప్తి చేసారు. వచ్చ ే
WD PhotoWD
గురువారం ఈ గ్రామంలో తన వైద్యానికి ముగింపు రోజుగా అతడు ప్రకటించాడు.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అతని సందేశాన్ని అతని అనుచురులు అనేక ప్రాంతాలకు చేరవేయడంతో దురదృష్టకరమైన ఆ గురువారం నాడు భారీ జనసందోహం చేరుకుంది. కానీ ప్రజలను నియంత్రించండంలో అతడి అనుచరులు విఫలమయ్యారు. దీంతో సహనం కోల్పోయిన బాబా ఒకరి తర్వాత ఒకరికి అన్న రీతిలో రోగులకు నీటిని పంపిణీ చేయకుండా, జనసందోహంపై అతడు చిలకరించడం మొదలుపెట్టాడు. నీటికై జరిగిన తొక్కిసలాట పదకొండు మంది ప్రజలను మృత్యుముఖంలోకి నెట్టివేసింది. దుర్ఘటనలో గాయాలపాలైన వారు అనేకం...

WD PhotoWD
విషాద సంఘటన చోటు చేసుకున్న అనంతరం పోలీసులు బాబాను అరెస్టు చేసారు. మంత్ర జలం లేదా 'సరోత'తో వ్యాధులను నయం చేస్తానని తానెప్పుడు ప్రకటించలేదని బాబా బుకాయిస్తున్నాడు. ఎయిడ్స్, క్యాన్సర్ వంటి వ్యాధుల గురించి తనకు తెలిసింది నామమాత్రమేనని అతడు అంటున్నాడు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అతడు ఎంత మోసం చేసాడో?

దుర్ఘటన అనంతరం, అతడి గురించి మేము గ్రామ ప్రజలను విచారించగా, ఒక క్షేత్రంలో నిర్మితమైన తన 'ఆశ్రమం'లో యావత్ కార్యక్రమాన్ని అతడు నిర్వహిస్తాడని తెలిపారు. వైద్యానికి అతడు ఒక్క రూపాయి కూడా తీసుకోడు కానీ ఆశ్రమానికి సమీపంలో దుకాణాలను నిర్వహించే అతని అనుచరులు పూజ సామాన్లను అధి క
WD PhotoWD
ధరలకు విక్రయిస్తారు.

దయచేసి అటువంటి బాబాలను నమ్మవద్దని, మూఢనమ్మకంపై అంధ విశ్వాసం ఏర్పరుచుకోవద్దని ఈ సందర్భంగా 'వెబ్‌దునియా' పాఠకులను కోరుకుంటున్నాము. నమ్మకానికి, మూఢనమ్మకానికి మధ్య వ్యత్యాసాన్ని తెలియపరిచే కథలను మీకు అందించేందుకు మా ప్రయత్నాలను నిరవధికంగా కొనసాగిస్తాము.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

Show comments