Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్కడ నమస్కరించకపోతే యాక్సిడెంట్ ఖాయం...

Webdunia
సోమవారం, 18 ఫిబ్రవరి 2008 (20:34 IST)
WD
' ఏదినిజం' శీర్షికలో భాగంగా ఈసారి... 'ఇప్పటికీ బతికే ఉన్నాడు' అని భావించే ఓ మహావ్యక్తి గురించి తెలియజేయబోతున్నాం. ఆశ్చర్యపోతున్నారా.. నిజమండీ... మధ్యప్రదేశ్‌లోని 'మౌ' వాసుల హృదయాలలో అతను ఇంకా బతికే ఉన్నాడు. అతనే తాంత్యా భీల్. అతని గురించే మీకు తెలియజేయబోతున్నాం.

తాంత్యా భీల్, ఇండియా రాబిన్ హుడ్‌గా సుపరిచితుడు. ఇతను స్వాతంత్ర్యోద్యమ కాలంలో బ్రిటిషువారికి కొరకరాని కొయ్య. జల్గావ్(సాత్పురా) మౌ (మాల్వా) మధ్య ప్రాంతాలలో అతని ప్రభావం అధికంగా ఉండేది. బ్రిటిషువారి సంపదను కొల్లగొట్టి ఆ సంపదను గిరిజన, పేద వర్గాల ప్రజలకు పంచేవాడని అప్పట్లో ప్రచారం జరిగేది. అతని దెబ్బకు బెంబేలెత్తిపోయిన బ్రిటిషియన్లు... అతన్నెలాగైనా పట్టుకోవాలని నిశ్చయించుకున్నారు. తాంత్యాను పట్టి యిచ్చినవారికి బహుమతి అందజేస్తామని ప్రకటనలు కూడా ఇచ్చారు. అయితే ప్రతిసారి వారి వ్యూహాలను తిప్పికొట్టి అత్యంత చాకచక్యంగా తాంతియా వారి నుంచి బయటపడేవాడు. తాంత్యాకు అతీత శక్తులేవో ఉన్నాయని ప్రజలు విశ్వసించేవారు.
WD


చివరికి పాటల్పానీ జలపాతానికి సమీపంలో గల రైల్వే ట్రాక్ వద్ద అతను ఎన్‌కౌంటర్ చేయబడ్డాడు. అయితే తాంత్యా ఆత్మ మాత్రం నేటికీ అక్కడ తిరుగాడుతోందని విశ్వాసం. ఈ నమ్మకాన్ని మరింత బలపరిచే విధంగా అతను మరణించిన నాటి నుంచి ప్రత్యేకించి ఆ రైలు మార్గంలోనే ప్రమాదాలు ఎక్కువయ్యాయి. తాంత్యా భీల్ వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయనీ, వాటి నివారణకు ఆ ప్రదేశంలో తాంత్యా భీల్ ఆలయాన్ని సైతం నిర్మించారు. అప్పటినుంచి అటుగా వెళ్లే రైళ్లన్నీ తప్పకుండా భీల్ దగ్గర ఆగి ఓ నమస్కార బాణం వేసి కదలటం ప్రారంభించాయి.

WD
రైల్వే వర్గాలు మాత్రం భీల్ పట్ల ఉన్న నమ్మకంపై తమ విభేదాన్ని తెలుపుతున్నాయి. రైల్వే ట్రాక్ మార్పిడిలో భాగంగా రైళ్లు అక్కడ ఆగటం సహజమని... పాటల్పాని నుంచి కాలాకుంద్ వెళ్లే రైలు మార్గం చాలా ప్రమాదకరమైనది కావటంతో అక్కడ రైళ్లు ఆగుతాయనీ.. పనిలోపనిగా ఎదురుగా తాంతియా భీల్ ఆలయం దర్శనమివ్వటంతో భక్తిపూర్వకంగా నమస్కరించటం సహజమేనని అంటున్నాయి.

అభిప్రాయాలు వేరైనా... ప్రతి రైలు అక్కడ ఆగటం నిజం... రైలును నడిపే ప్రతి డ్రైవరు తాంతియా భీల్‌కు నమస్కరించటమూ నిజం. ఈ మార్గాన ప్రయాణించే ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. ఒకవేళ ఏ రైలైనా ఆ ప్రదేశంలో ఆగకుండా వెళ్లినట్లయితే.. ఖచ్చితంగా ప్రమాదానికి గురవుతుందనేది అక్కడి స్థానికుల మాట. ఈ సంఘటన పట్ల మీరేమనుకుంటున్నారు?... మీ అభిప్రాయాలను మాకు తప్పక రాయండి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments