Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిశూలంతో రోగులకు శస్త్ర చికిత్స

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2007 (20:01 IST)
WD
ఈ వారం మీ ముందు మరో నమ్మలేని నిజం... దాని వెనక ఉన్న ఆసక్తికర అంశాలను తెలియజేయబోతున్నాం. తన వద్దనున్న త్రిశూలంతో రోగులకు శస్త్ర చికిత్స చేయటం ద్వారా వ్యాధులను నయం చేస్తానని చెప్పే బాబా గురించి నిగూఢ రహస్యాలను మీ ముందు ఉంచబోతున్నాం.

బాబాగా చెప్పుకునే బాలేలాల్ శర్మ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో తనకంటూ ఓ దేవాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు తనలో అతీంద్రియ శక్తులు ప్రవేశిస్తాయని నమ్మబలుకుతుంటాడు. అయితే అతను చెబుతున్నవాటిని అతని కుటుంబ సభ్యులతో సహా ఎవరూ నమ్మటంలేదు.

అతను ఇనుప మేకులతో కూడిన పీఠంపై కూర్చోవటాన్ని చూశాం. అయితే ఇలా చేసేముందు అప్పటి వరకూ ధరించిన కుర్తా- పైజమాను తీసివేసి వాటికి బదులుగా జీన్స్ వేసుకోవటాన్ని గమనించాం. మేకులు ఎలాంటి గాయం చేయకపోయినట్లయితే... బాబా తన దుస్తులను ఎందుకు మార్చుకుంటున్నట్లు?
WD


ఆ సంగతలా ఉంచితే.... దుస్తులను మార్చుకున్న తర్వాత రెండు నిమిషాలపాటు అతను ధ్యానంలో నిమగ్నమయ్యాడు. తర్వాత అతను పూనకం వచ్చినవాడిలో వణకటం ప్రారంభించాడు. ఈ పరిణామంతో అక్కడికి వచ్చినవారంతా ఆయనను కీర్తించటం మొదలుపెట్టారు. అంతేకాదు భక్తులు అతనికి పూలను సమర్పించారు. అప్పుడు బాబా మా కెమేరామేన్‌తో మాట్లాడటం ప్రారంభించాడు.

WD
ఇప్పుడు బాబా దర్బారు మనముందు ఉంది. బాబాను నమ్మి వచ్చిన ప్రజలు ఒక్కొక్కరుగా అతనివద్దకు వస్తున్నారు. అతను రకరకాల విచిత్రాలను చేయటం ప్రారంభించాడు. వారి సమస్యలను అతను కనుగొంటున్నాడు... పూలను రేవరి (ఒకరకమైన తీపి పదార్థం)గా మార్చేస్తున్నాడు.

ఇంతలో రెండు కిడ్నీలు పాడైపోయి పూర్తి అనారోగ్యంతో బాధపడుతున్న ఓ కిడ్నీ రోగి అక్కడికి వచ్చాడు. అయితే ఓ నిమ్మకాయలో గోధుమ గింజలను చూసిన తర్వాతే అతనికి శస్త్ర చికిత్స చేస్తానని బాబా అన్నాడు. అద్భుతం.. నిజంగానే నిమ్మకాయ నుంచి గోధుమలు బయటపడ్డాయి. అప్పుడు బాబా ఆ రోగికి శస్త్ర చికిత్స చేయటానికి సంసిద్ధుడయ్యాడు.

ఆపరేషన్ చేసేముందు రోగి శరీరాన్ని ఓ బెడ్ షీటుతో కప్పుతున్నాడు. ఆ తర్వాత ఓ అవివాహిత మహిళను పిలిచి ఆ రోగి తలలో త్రిశూలాన్ని గుచ్చమని చెపుతున్నాడు. బాబా చెప్పినట్లే ఆ మహిళ రోగి తలలో దాదాపు 4 నుంచి 5 అంగుళాల లోతున త్రిశూలాన్ని గుచ్చుతోంది. చిత్రం... రోగి తలలో నుంచి ఒక్క చుక్క రక్తపు బొట్టు కూడా రాలేదు.

మరో భక్తుడు కొన్ని న్యాయపరమైన సమస్యలతో బాబా ముందుకు వచ్చాడు. బాబా అతనికి కొన్ని గింజలు ఇచ్చి అతని సమస్య తీరిపోతుందని తేలిగ్గా చెప్పేశాడు. అలాగే రక్త స్రావం అవుతున్న మరో రోగికి ఇదే పద్ధతిలో శస్త్ర చికిత్స చేస్తున్నాడు. ఈసారి కూడా ఆ అవివాహిత మహిళ బాధితుని తలలో 4 నుంచి 5 అంగుళాల మేర త్రిశూలాన్ని గుచ్చింది.
WD


మునుపటిలాగే ఈసారి కూడా బాధితుని తలలోనుంచి ఒక్క బొట్టు రక్తం చుక్క కూడా రాలేదు. ఇవేకాదు గర్భ సంబంధిత సమస్యలు, న్యాయపరమైన చిక్కులు, తక్షణ వైద్య సహాయం అవసరమయ్యేటటువంటి అనేక సమస్యలను తాను నిరంతరం పరిష్కరిస్తున్నాని బాబా చెపుతున్నాడు.

FileWD
అయితే ప్రతి కేసులోనూ అతను ప్రత్యేకించి ఆ అవివాహిత మహిళను మాత్రమే పిలవటాన్ని మేము గమనించాం. అతను చెప్పే కథాకమామిషుల వెనక ఉన్న అసలు రహస్యాన్ని మేము తెలుసుకున్నాం. అయితే ఏ ఒక్క భక్తుడు ఆ దిశగా ఆలోచించకపోవటాన్ని చూసి మాకు ఆశ్చర్యమేసింది.

తాను ఎటువంటి ఫలాన్ని ఆశించటం లేదని బాబా చెప్పాడు. అయితే భక్తులు బాబాకు పూల దండలు, సువాసనలు వెదజల్లే సాంబ్రాణీ కడ్డీలు సమర్పిస్తున్నారు. దీనినిబట్టి బాబాకు వీటిని తప్పకుండా సమర్పించాలన్న విషయం అవగతమయ్యింది. బాబా మహిమను తెలుసుకుని తాము అక్కడకు వస్తున్నట్లు భక్తులు మాతో అన్నారు

అంతేకాదు బాబా చికిత్స చేసిన తర్వాత తమకు ఎంతో ఉపశమనం కలిగిందని కొందరు భక్తులు చెపుతున్నారు. అయితే వారు చెప్పేదాని వెనక ఉన్న అసలు రహస్యం మాకు తెలియదు, కానీ సదరు వ్యక్తి మాత్రం రోజుకో కొత్త సంగతిని చెపుతూనే ఉన్నాడు.
WD


అంతేకాదు కేవలం బ్లేడు సాయంతో మేజర్ ఆపరేషన్‌ సైతం చేస్తానంటున్నాడు. తడి నేలను ఉపయోగించి కిడ్నీలో రాళ్లు లేకుండా కిడ్నీ బాగుచేస్తానంటున్నాడు. ఇటువంటి చిత్రమైన సంగతులు చెప్పే బాబాలు గురించి మీరేమనుకుంటున్నారు?

Snake On Plane: విమానంలో పాము-పట్టుకునేందుకు రెండు గంటలైంది.. తర్వాత?

బెంగళూరు ఇన్ఫోసిస్ రెస్ట్‌రూమ్ కెమెరా.. మహిళలను వీడియోలు తీసిన ఉద్యోగి

చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే చెప్పుతో కొడతారు : బైరెడ్డి శబరి

ఒక్కరవ దెబ్బకే ఎలా చచ్చిపోతాడు, ఆంబులెన్సులో ఏదో జరిగింది: సింగయ్య భార్య (video)

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అదృశ్యం

30-06-2025 సోమవారం దినఫలితాలు - వాగ్వాదాలకు దిగవద్దు... సహనం పాటించండి..

29-06-2025 ఆదివారం దినఫలితాలు - శ్రమించినా ఫలితం ఉండదు...

29-06-2025 నుంచి 01-07-2025 వరకు మీ వార రాశిఫలాలు

28-06-2025 శనివారం దినఫలితాలు - నగదు చెల్లింపుల్లో జాగ్రత్త...

Sankashti Chaturthi: ఆషాఢ శుక్ల పక్షం- చతుర్థి వ్రతం - రవియోగం- వినాయక పూజతో అంతా శుభం

Show comments