Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ నక్షత్రంలో పుట్టారా..? పట్టుదల - మొండితనం ఎక్కువే!

Webdunia
మంగళవారం, 22 ఏప్రియల్ 2014 (15:47 IST)
File
FILE
విశాఖ నక్షత్రంలో పుట్టిన జాతకులకు పట్టుదల, మొండితనం ఎక్కువని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇతరులకు చిన్న సహాయం చేసినా.. భూతద్దంలో చూపించే మనస్తత్వం వీరిదని వారు చెబుతున్నారు. ఇతరులకు సహాయం చేయాలంటే వెనుకడుగు వేసే ఈ జాతకులు, సతీమణి లేదా స్త్రీ సహకారం లేనిదే జీవితంలో రాణించడం కష్టమేనని జ్యోతిష్యులు చెపుతున్నారు.

కఠినమైన మనస్తత్వం కలిగి వుండే ఈ జాతకులు, సంతానం వల్ల పేరు, ప్రఖ్యాతులు కోల్పోయే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు మినహా ఇతరులపై ప్రేమాభిమానులు చూపడం తక్కువేనని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఇంకా విశాఖ నక్షత్రంలో జన్మించిన జాతకులు తనకు తోచిన మార్గంలో పయనిస్తూ... ఇతరుల సలహాలను ఏమాత్రం గౌరవించరు. అన్యభాషల పరిజ్ఞానంతో ఏ రంగంలోనైనా ధీటుగా రాణిస్తారు. పొదుపుకు పెద్దపీట వేసే ఈ జాతకులకు ఆధ్మాతిక చింతన మెండు. అయితే ఆధ్యాత్మిక రంగంలో మోసపోయేందుకు ఆస్కారాలున్నాయి.

అలాగే కీర్తి, స్థిరాస్తులు వంశ పారంపర్యంగా లభిస్తాయి. వంశపారంపర్య ఆస్తికంటే స్వతహాగా ఆస్తిని కూడబెట్టుకునే సత్తా విశాఖ నక్షత్ర జాతకులకుంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో పుట్టిన జాతకులకు నీలం రంగు అన్ని విధాలా అనుకూలిస్తుంది. కాబట్టి నీలపు రంగు చేతి రుమాలును అధికంగా వాడటం మంచిది. అలాగే విశాఖ నక్షత్ర జాతకులకు ఆరు అనే సంఖ్య అన్ని విధాలా సహకరిస్తుంది. అలాగే 4, 5, 8 అనే సంఖ్యలు కూడా శుభ ఫలితాలనిస్తాయి. అయితే 1, 2 అనే సంఖ్యలు ఏ మాత్రం కలిసిరావు. ఇదేవిధంగా గురువారం తలపెట్టే కార్యాలు ఈ జాతకులకు దిగ్విజయంగా పూర్తవుతాయి.

ఇక విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో పుట్టిన జాతకులకు మంగళవారం, సోమవారం, బుధవారం అన్ని విధాలా కలిసొస్తుంది. అయితే చంద్రాస్టమం దినాల్లో ఈ జాతకులు ఎలాంటి శుభకార్యాలను ప్రారంభించకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఇంకా విశాఖ నక్షత్ర నాలుగో పాదంలో జన్మించిన జాతకులకు 9 అదృష్ట సంఖ్య. ఇంకా 9, 18, 36 అనే సంఖ్యలు శుభఫలితాలనిస్తాయి. అయితే 6, 8 సామాన్య ఫలితాలనివ్వగా, 4, 5, 6, అనే సంఖ్యలు వీరికి అశుభ ఫలితాలిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇక పసుపు, ముదురు పచ్చ రంగు వీరికి అదృష్టానిస్తాయి.

ఇదిలా ఉంటే.. విశాఖ నక్షత్రంలో పుట్టిన జాతకులు వ్యాపారాభివృద్ధి కోసం ప్రతి శుక్రవారం నేతితో సుబ్రహ్మణ్య స్వామికి దీపమెలిగించడం మంచిది. ఇలా తొమ్మిది వారాలు ఆలయాల్లో సుబ్రహ్మణ్యేశ్వరుని దీపమెలిగిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments