Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక మాసం..చెల్లాపూర్‌ నందా దీపాన్ని దర్శించుకుంటే.. ?

Webdunia
బుధవారం, 29 అక్టోబరు 2014 (18:50 IST)
కార్తీక మాసంలో ఆలయాల్లో వెలిగించే అఖండ దీపాన్ని.. నందా దీపం అంటారు. గర్భాలయంలో కొలువైన దైవాన్ని ఈ దీపారాధన వెలుగులోనే దర్శించాలని శాస్త్రం చెబుతోంది. ఇక ఈ దీపారాధన కొన్ని దేవాలయాల్లో 'అఖండ దీపం'గా కనిపిస్తూ వుంటుంది. అంటే ఈ జ్యోతిని కొండెక్కనీయకుండా చేస్తూ నూనె, వత్తులను మారుస్తూ ఉంటారు. ఈ అఖండ దీపాన్నే 'నందాదీపం' అని కూడా పిలుస్తుంటారు. 
 
ఇలా తరతరాలుగా వెలుగుతోన్న ఈ నందాదీపాన్ని దర్శించడం వలన సమస్త దోషాలు నివారించబడతాయని పంచాంగ నిపుణులు చెబుతున్నారు. అలాంటి 'నందా దీపం' మనకి చెల్లాపూర్‌లోని కృష్ణుడి ఆలయంలో కనిపిస్తుంది. 
 
మెదక్ జిల్లా పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ఇక్కడి నందా దీపం రెండు వందల సంవత్సరాలపై నుంచి వెలుగుతూనే వుంది. ఆలయం తలుపులు మూసి వున్న సమయంలోను, ప్రధాన ద్వారానికి చేయబడిన రంధ్రం గుండా ఈ దీపం కాంతి కనిపిస్తూనే వుంటుంది. దైవ దర్శనం కాని వాళ్లు ఈ దీప దర్శనంతో సంతృప్తి చెందుతారు. 
 
ఈ ఆలయంలో మీసాలతో కృష్ణుడు దర్శనమిస్తాడు. ఈయన మహిమాన్వితుడనీ, ఆయన అనుగ్రహంతో వెలుగుతోన్న అఖండ దీప దర్శనం సకల శుభాలను కలిగిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 
 
కష్టాల్లో ... బాధల్లో వున్న వాళ్లు 'నందా దీపం' మొక్కుని మొక్కుకుంటూ వుంటారు. ఒక మట్టి మూకుడులో నూనె పోసి, పెద్ద వత్తివేసి.. ఆలయానికి చేరుకొని అక్కడి నందా దీపంలోని జ్యోతితో ఆ వత్తిని వెలిగిస్తుంటారు. అలా దీపం వెలిగించబడిన మట్టి పాత్రను తలపై పెట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

లేటెస్ట్

18-07-2025 శుక్రవారం దినఫలితాలు - మనోధైర్యంతో లక్ష్యసాధనకు కృషి చేయండి...

అజ్ఞానం, సందేహాలు తొలగిపోయి జ్ఞానం ఇచ్చేదే భగవద్గీత : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

కాలాష్టమి 2025: మినపప్పుతో చేసిన గారెలు.. పెరుగు అన్నం ఆహారం

17-07-2025 గురువారం దినఫలితాలు - ఆప్తులను విందులు - వేడుకలకు ఆహ్వానిస్తారు...

16-07- 2025 బుధవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు...

Show comments