Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jogulamba: జోగులాంబ ఆలయం.. దక్షిణ కాశీ.. జీవకళ తగ్గితే.. అక్కడ బల్లుల సంఖ్య పెరిగితే?

సెల్వి
సోమవారం, 5 మే 2025 (14:05 IST)
Jogulamba Temple
జోగులాంబ ఆలయం తెలంగాణలో వుంది. బలం, రక్షణకు చిహ్నమైన దుర్గమ్మ తల్లి రూపం జోగులాంబది.  తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్‌లో ఉన్న ఈ ఆలయం మహా శక్తిపీఠాలలో ఒకటి. ఇది తుంగభద్ర. కృష్ణ నదుల సంగమం వద్ద ఉంది. నల్లమల కొండలతో చుట్టుముట్టబడి ఉంది. 
 
ఇది క్రీ.శ. ఏడవ శతాబ్దంలో చాళుక్య రాజవంశం పాలనలో ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయంలో శివులు, విష్ణవులు వుంటారు. అద్భుతమైన నిర్మాణ నైపుణ్యాన్ని ప్రదర్శించే తొమ్మిది దేవాలయాల సమూహం ఈ ఆలయం గొప్పతనం. అందుకే దీనిని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు. నేటి అలంపూర్‌లో వేలాది సంవత్సరాలుగా బ్రహ్మ గొప్ప తపస్సు చేశాడని కూడా చెబుతారు.
 
పరమపావనమైన ఆలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై దర్శనమిస్తారు. కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి, వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని, ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని, దీని సారాంశం. 
Jogulamba Temple
 
ఇంట్లో జరిగే శుభాశుభాలకు అమ్మవారు ప్రతిరూపం అని, అందుకే జోగులాంబ అమ్మవారిని గృహచండిగా పేర్కొనడం అనాదిగా వస్తోంది. వాస్తుదోష నివారణలకు కూడా అమ్మవారిని మొక్కితే త్వరితగతిన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం. రోజూవారీ పూజలతో పాటు, ఆ తల్లికి ప్రీతికరమైన మంగళ, శుక్రవారాల్లో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. 
 
ఆలంపూర్ క్షేత్రంలో కార్తీకమాసం పూజలు, శివరాత్రి పర్వదినాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. కార్తీక మాసంలో జరిగే ప్రత్యేక ఉత్సవాల కోసం దేవాలయాన్ని కన్నుల పండుగగా విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. ఈ మాసంలో భక్తులతో పాటు వీఐపీల తాకిడి ఎక్కువగా ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జేఈఈ అడ్వాన్స్‌డ్ స్థాయిలో నీట్ ఫిజిక్స్ ప్రశ్నపత్రం!! నీరుగారిన పోయిన అభ్యర్థులు!

యజమానిని చంపేసిన పెంపుడు కుక్క... ఎక్కడ?

Mahanadu: కడపలో టీడీపీ మహానాడు.. శరవేగంగా ఏర్పాట్లు.. పసందైన వంటకాలు

జమ్మూకాశ్మీర్ జైళ్లను పేల్చివేసేందుకు ఉగ్రవాదుల కుట్ర!

మానవత్వం చాటుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

03-05-2025 శనివారం దినఫలితాలు - వ్యూహాత్మకంగా అడుగులేస్తారు...

02-05-2025 శుక్రవారం దినఫలితాలు - దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది...

How to Worship God: పూజను నిల్చుని చేయాలా? లేకుంటే కూర్చుని చేయాలా?

01-05-2025 గురువారం దినఫలితాలు - వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి...

అక్షయ తృతీయ 2025: శ్రీలక్ష్మీ మంత్ర పఠనతో అంతా సుఖమే

తర్వాతి కథనం
Show comments