Webdunia - Bharat's app for daily news and videos

Install App

కందిమల్లాయపల్లెలో బ్రహ్మంగారి పవిత్ర పాద ముద్రికలు.. పంచకళ్యాణి గుర్రంపై వెళ్తూ వెళ్తూ...?!

బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన మహాజ్ఞాని. నాలుగు వందల సంవత్సరాల క్రితమే ప్రజల్లో చైతన్యాన్ని కలిగించిన మహాజ్ఞాని. కడప జిల్లాలో కందిమల్లాయపల్లెలో బ్రహ్మంగారి పాద ముద్రికలున్నాయి. కందిమల్లాయపల్లె కాలక్రమేణ

Webdunia
గురువారం, 28 జులై 2016 (11:48 IST)
బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన మహాజ్ఞాని. నాలుగు వందల సంవత్సరాల క్రితమే ప్రజల్లో చైతన్యాన్ని కలిగించిన మహాజ్ఞాని. కడప జిల్లాలో కందిమల్లాయపల్లెలో బ్రహ్మంగారి పాద ముద్రికలున్నాయి. కందిమల్లాయపల్లె కాలక్రమేణా బ్రహ్మం గారి మఠంగా మారిపోయింది. ఈ ఊరు చుట్టుపక్కలా ఎక్కడా చూసినా కొండలు, గుట్టలు ఉన్నాయి. ఈ గుట్టలపైనే ఆయన కాలిముద్రలు, ఆయన గుర్రం పంచ కల్యాణి గిట్టల ముద్రలు కనిపిస్తున్నాయి. 
 
ఈ విషయం ఆ ప్రాంతంలోని స్థానికులకు తప్ప ప్రపంచంలో ఎవరికీ తెలియదు. కందిమల్లాయపల్లె గుట్టల్లో గల ఈ పాద ముద్రలు చాలా పవిత్రమైనవని.. వీటిని భక్తులు దర్శించుకుంటున్నారని స్థానికులు అంటున్నారు. రోడ్డు మార్గాలు లేని సమయంలో కందిమల్లాయపల్లె పెద్దలను వడ్రంగి పని చేసుకుంటానని  వీరబ్రహ్మేంద్ర గారు కోరినట్లు స్థానికులు చెప్తున్నారు. 
 
ఇంకా మైదుకూరు ఇతర ప్రాంతాలకు బ్రహ్మంగారు తన పంచకళ్యాణి గుర్రంపైకి వచ్చివెళ్లే వారని స్థానికులు అంటున్నారు. అలా వచ్చి వెళ్తున్నప్పుడు ఓసారి కందిమల్లయ్యాపల్లెలో పంచకళ్యాణి గుర్రం ఒకసారిగా ముందుకు వెళ్లకుండా ఆగిపోయిందని.. అప్పుడు తన పవిత్ర పాదాలను బ్రహ్మంగారు ఇక్కడ మోపారని స్థానికులు చెప్తున్నారు. 
 
అంతేగాకుండా బ్రహ్మంగారు తన శిష్యపరిగణాలతో ఒకరోజు కూడా కందిమల్లాయపల్లెలో గడిపారని, ఆ  సందర్భంగా బ్రహ్మంగారు గడిపిన వేదిక ఇక్కడ కనిపిస్తుంది. చుట్టూ కొండలు, వృక్షాలతో కూడిన ఈ ప్రాంతంలో బ్రహ్మంగారి పాద ముద్రికలుండటాన్ని దర్శించుకుంటున్న భక్తులకు ప్రశాంతను సొంతం చేసుకుంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫ్లైఓవర్‌పై ఫోటో షూట్ పేరుతో యువకులు హల్ చల్- డ్రోన్ కనిపించడంతో పరుగులు (video)

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

రూ.1 కోటి విలువైన 1,000 దొంగలించబడిన మొబైల్ ఫోన్లు స్వాధీనం

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

జనవరి 29-31 వరకు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మేడారం మహా జాతర

TTD: దర్శన టిక్కెట్ల కోసం మధ్యవర్తుల బారిన పడవద్దు.. టీటీడీ

02-07-2025 బుధవారం దినఫలితాలు : ఆరోగ్యం మందగిస్తుంది.. జాగ్రత్త

01-07-2025 మంగళవారం దినఫలితాలు - పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం...

జూలై మాసంలో మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments