లోహంతో చేసిన తాబేలును ఇంట్లో ఉంచుకుంటే అష్టైశ్వరాలు చేకూరుతాయా?

Webdunia
శనివారం, 28 సెప్టెంబరు 2019 (19:25 IST)
ఐశ్వర్యం కలగాలంటే దైవానుగ్రహం కావాలి. దైవభక్తి సత్ర్పవర్తన కలిగి వుండి, సంపదలో కొంత సత్కార్యాల కోసం వినియోగిస్తూ వుంటే భగవంతుడు అనుగ్రహిస్తాడంటుంది శాస్త్రం. లోహాలతో చేసే తాబేళ్లు అలంకార సామగ్రి మాత్రమే. వాటితో ఏవో అద్భుతాలు జరిగిపోతాయన్నది కేవలం ఓ నమ్మకం మాత్రమే. ఇందుకు శాస్త్రీయమైన ప్రమాణం ఏమీ లేదు. 
 
ఇకపోతే వెండి, రాగి, ఇత్తడి తదితర పంచలోహాలతో చేసే యంత్రాలను పూజా మందిరంలో వుంచి, నిత్య పూజాధికాలు చేసే పద్ధతి వుంది. ఈ యంత్రాలపైన రేఖల రూపంలో, బీజాక్షరాలతో దైవీశక్తిని ఆవాహనం చేస్తారు. యంత్రాల తయారీలో ఎంతో నిబద్ధత, జాగరూకత కావాలి. 
 
కేవలం యంత్రం పైన రేఖలు, అలంకారం వుంటే సరిపోదు. సంబంధిత దేవత మంత్రాలను పునశ్చరణ చేసి యంత్రాలకు ప్రాణప్రతిష్ట చేసినప్పుడే వాటిలోని దైవీశక్తి కొలువుంటుంది. అలా చేయని యంత్రాలు అలంకారప్రాయంగానే నిలుస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ChandraBabu: నాలుగు గంటలే నిద్రపోయే ఏపీ సీఎం చంద్రబాబు.. ఫాలో అవుతున్న నారా లోకేష్

నవంబర్ 8న నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం

2027 Jagan Padayatra: 2027లో జగన్ కొత్త పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారా?

Lizard: వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారు, వెండి ప్రతిమలు మాయం (video)

Rayalacheruvu-శ్రీకాళహస్తిలో భారీ వర్షాలు.. రాయలచెరువులో పంటలు మునక

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీక పౌర్ణమి: 365 వత్తులతో దీపాన్ని వెలిగించేటప్పుడు ఇది చేయకండి..

04-11-2025 మంగళవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు

నాకంటే పెద్దావిడ నాకు పాద నమస్కారం చేసింది, అలా చేయవచ్చా? పెద్దవారికి కదా చేసేది...

karthika masam, దీపం జ్యోతిః పరబ్రహ్మః, కళ్ళతో దీపం జ్వాలను ఏకాగ్రతతో చూస్తే?

03-11-2025 సోమవారం ఫలితాలు - ఈ రోజు కలిసివచ్చే సమయం.. ఎవరికి?

తర్వాతి కథనం
Show comments